తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిన్నటిలా.. రేపటి రోజులు ఉండేలా కనిపించడం లేదు. శత్రు శేషం పెరిగిపోతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఆయన ఒకప్పుడు.. తెలంగాణకు తాను మాత్రమే దిక్కు.. తాను మాత్రమే ప్రజలను ఉద్ధరిస్తానని.. ప్రకటించుకునేవారు. అయితే.. దీనిని నమ్మిన జనాలు.. కారణాలు ఏవైనా.. బలమైన నాయకత్వం రాష్ట్రానికి అవసరమని.. అనుకున్నారో.. ఏమో.. కేసీఆర్‌ను రెండోసారి కూడా అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే.. ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోయింది. ఎటు చూసినా.. ఎవరిని కదిలించినా.. అధికార పార్టీ అంటే.. ఆ ఇద్దరే
అనే మాట ప్రజల్లో వినిపిస్తోంది.
ఇదే విషయం ఇటీవల సీ-ఓటరు సర్వేలోనూ స్పష్టంగా కనిపించింది. దేశంలో ప్రజలు ఎక్కువగా ఆగ్రహం తో ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో కేసీఆర్ ఉన్నారు. దీనిని అంత తేలికగా తీసుకునే పరిస్థితి కనిపిం చడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల బలం కనుక పోతే.. కేసీఆర్‌కు ఇబ్బందులు తప్పవు. ఇదిలావుంటే.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాల దూకుడు పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్ లు ఒకవైపు దూకుడు పెంచితే.. మరోవైపు షర్మిల కూడా పాదయాత్ర చేస్తున్నారు. ఈ మె విషయాన్ని పక్కన పెట్టినా.. బీజేపీ దూకుడు.. కాంగ్రెస్ దూకుడు కూడా పెరిగాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇటీవల సీ-ఓటరు సర్వేలోనే.. ఒక ప్రతిపాదన వచ్చింది. ఇప్పుడున్న వ్యతిరేకత నుంచి బయటకు వచ్చేందుకు కేసీఆర్‌కు ఒక అత్యున్నత మార్గం ఉందని.. సీఓటరు సర్వే నిర్వాహకులు సూచించారు. తన కుమారుడు కేటీఆర్‌ను కేసీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే.. తప్ప ప్రయోజనం లేదని చెబుతున్నారు.దీనికి కారణాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం దీనిపైనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌లో యువ నాయకుడు.. రేవంత్ రెడ్డి, బీజేపీ బండి సంజయ్ లు దూకుడుగా ఉన్నాఉ. వీరిని పక్కన పెట్టినా.. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతున్నారనే వాదనను బలంగా తీసుకువెళ్లడంలో ఈ రెండు పార్టీల నేతలు సక్సెస్ అయ్యారు.
ఈ పరిణామాలు.. కేసీఆర్‌కు ప్రధాన ఇరకాటంగా మారిపోతున్నాయి. అదేసమయంలో అవినీతి లేకున్నా.. ప్రభుత్వం గుర్తొచ్చినప్పుడు చేస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక, కేసీఆర్ పాలనపై వ్యతిరేకత లేకున్నా.. ఆయన ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు సచివాలయానికి రావడం.. ఎక్కువ సేపు ఫామ్ హౌజ్‌కే పరిమితం అవుతున్నారనే చర్చ గ్రామస్థాయిలో జరుగుతోంది. ఇక, ఇప్పుడు పాదయాత్రల పరంపర కూడా టీఆర్ ఎస్‌ను ఇబ్బందికి గురి చేస్తుందని అంటున్నారు.
పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నా.. అంతర్గతంగా మాత్రం ఇప్పుడున్న విధంగా రేపటి రాజకీయం ఉండదనే అంటున్నారు పరిశీలకులు. ఏదేమైనా.. ఇప్పుడు.. రాజకీయంగా కేసీఆర్ వేసే అడుగులు.. రేపటి అధికారాన్ని నిర్ణయిస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుతం సీ ఓటరు సర్వేపై మేధావి వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం.
This post was last modified on October 24, 2021 12:20 am
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…