దూకుడైన రాజకీయ నేతగా పేరున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాక మరింత జోరు పెంచారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారుతున్నారు. సీఎం కేసీఆర్ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. సభలు సమావేశాలంటూ కార్యకర్తలో తిరిగి ఉత్సాహం నింపుతున్నారు. కేసీఆర్ రేవంత్ మధ్య రాజకీయ శత్రుత్వం ఇప్పుడు మరో స్థాయికి చేరింది. కేసీఆర్‌ను గద్దె దించేంతవరకూ తగ్గేదే లేదని రేవంత్ దూసుకెళ్తున్నారు. కేసీఆర్ రాజకీయ పతనం కోసం ప్రయత్నిస్తున్న రేవంత్.. తనకు పీసీసీ పదవి రావడానికి మాత్రం కేసీఆర్ కారణమని ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీలో నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌కు టీపీసీసీ పదవి కట్టబెట్టందంటూ పార్టీలోని సీనియర్ నేతలు అధిష్టానాన్ని కోరారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఆ పదవిపై ఆశ పడ్డారు. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ వైపే మొగ్గుచూపింది. ఆయననే అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఇది నచ్చని కొంతమంది సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఇదంతా పక్కనపెడితే సీనియర్లను కాదని తనను పీసీసీ అధ్యక్షుడిగా అధిష్ఠానం ఎంపిక చేసేందుకు కేసీఆర్ ప్రధాన కారణమని రేవంత్ అన్నారు. కేసీఆర్ తనను వెంటాడి వేధించారని కేసులు పెట్టించి జైల్లో వేశారని.. అయినా తాను ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కేసీఆర్‌పై పోరాటం సాగించానని అందుకే కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము ఒక్క రేవంత్‌కే ఉందన్న నమ్మకం తెలంగాణ ప్రజల్లో వచ్చిందని రేవంత్ చెప్పారు. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకునే అధిష్టానం తనకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిందని అన్నారు.
తెలంగాణలో కేసీఆర్‌తో కాంగ్రెస్ యుద్ధం చేస్తుందని ఈ పోరులో ఏ మాత్రం పట్టు విడిచినా దెబ్బ పడడం ఖాయమని రేవంత్ చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్ కోసం పనిచేసే కోవర్టులను పార్టీ నుంచి వెళ్లిపోమ్మని ముందే తేల్చి చెప్పారు. కేసీఆర్ అధికారం కోసం ఏమైనా చేస్తారని విమర్శలు చేసిన రేవంత్.. ఈ సీఎంపై మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో భాగంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ అవసరమైతే కాళ్లు లేకపోతే జుట్టు పట్టుకుంటారని ఎంతటి నాయకులనైనా పార్టీలోకి చేర్చుకునేందుకు అవసరమైన వ్యూహాలు ఆయన రచిస్తారని అందుకోసం ఆయన ఏమైనా చేస్తారనే రేవంత్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పదవి నుంచి దిగిపోవడం ఖాయమన్నారు. ఇక కేసీఆర్ అవసరం ఉన్న ఏకైక పార్టీ బీజేపీనే అని రేవంత్ కుండ బద్ధలు కొట్టారు. మోడీ అమిత్ షా కేసీఆర్ విస్కీ సోడాలాగా కలిసి పోయి ఉంటారని వాళ్లంతా ఒకటేనని ఆయన చెప్పారు.
This post was last modified on October 24, 2021 12:20 am
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…