ఎటు చూసినా.. పచ్చజెండాలు. కాలు కదిపేందుకు వీలు లేనంతగా తమ్ముళ్లు.. పార్టీ అభిమానులు.. మహి ళా నాయకులు.. ఎటు చూసినా.. బారులు తీరిన జనం.. ఇదీ.. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం వద్ద .. తాజా పరిస్థితి. చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు కనీ వినీ ఎరుగని స్పందన లభించింది. నిజానికి చంద్రబాబు కూడా ఇంత రేంజ్‌లో స్పందన వస్తుందని ఊహించి ఉండరని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని ఆరోపిస్తూ.. చంద్రబాబు దీక్షకు కూర్చున్న విషయం తెలిసిందే.
గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన దీక్షకు మధ్యాహ్నం వరకు కీలక నేతలు చేరుకున్నా.. సాధారణ ప్రజలు, దిగువ శ్రేణి నాయకులు మాత్రం చేరుకోలేదు. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు అనుకున్నమేరకు హడావుడి కనిపించలేదు. దీంతో వైసీపీ మంత్రులు కొందరు ఈ పరిణామాలను ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఒక్కరే దీక్షలో కూర్చున్నారని.. ఆయన కు పెద్దగా స్పందన రాలేదని.. అన్నారు. అయితే.. వాస్తవానికి అప్పటికే జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు కదిలాయి. మంగళగిరి కార్యాలయానికి.. చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చాలా మంది నిన్న సాయంత్రం వరకు చేరుకోలేక పోయారు.
వీరిలో మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. ఇక, ఇదే విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారనని.. నిరసన తెలిపే హక్కుపై ఉక్కుపాదం మోపుతున్నారని.. వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు అత్యవసర సమావేశం నిర్వహించి..పార్టీ నేతలు వదిలేయాలని నిర్ణయించారు. ఇక, అప్పటి నుంచి అన్ని దారులు.. టీడీపీ కేంద్ర కార్యాలయానికే దారితీశాయి. దీంతో రాత్రి ఏడు గంటల సమయం నుంచి టీడీపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. పార్టీ కార్యాలయానికి ముందున్న జాతీయ రహదారి కూడా .. వాహనాలతో నిండిపోయింది.
ప్రస్తుతం టీడీపీ కార్యాలయంలో అడుగు పెట్టేందుకు చోటు లేనంతగా తమ్ముళ్లు చేరుకున్నారు. మరోవై పు.. మహిళానాయకులు కూడా క్యూ కట్టారు. ఎటు చూసినా.. పసుపు జెండాలే కనిపిస్తున్నాయి. చంద్రబాబు దీక్షకు అందరూ సంఘీభావం ప్రకటించారు. మరోవైపు.. జిల్లాల్లోనూ నాయకులు.. దీక్షలు చేపట్టారు. ఎక్కడికక్కడ జిల్లా అధ్యక్షులు దీక్షలకు కూర్చున్నారు. ఇక, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులు.. మంగళగిరి కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున వచ్చారు. ఈ పరిణామం.. చూసిన వారు.. చంద్రబాబు ఊహించిన దానికంటే కూడా.. ఎక్కువగా స్పందన వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం దీక్షకు వచ్చిన జనాల ఫొటోలతో సోషల్ మీడియా నిండిపోవడం గమనార్హం.
This post was last modified on October 22, 2021 2:27 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…