Political News

‘కాన్సిట్యూష‌న‌ల్ హెడ్‌..’ త‌ల‌ న‌రికేయొచ్చా..జ‌గ‌న్ స‌ర్‌!!

ఒక‌టి అని రెండు అనిపించుకోవ‌డం.. అంటే ఇదే అంటున్నారు ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చూసిన‌.. నెటిజ‌న్లు. తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌డిచిన రెండు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై వ‌రుసగా రెండోరోజూ ఆయ‌న మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రోసారి జ‌గ‌న్ గుర్తు చేశారు. అయితే.. ఈ సంద‌ర్భంగా.. ఆయ‌న బోష్‌డీకే.. అనే మాట‌కు అర్ధం చెప్పారు. అది ఇదీ.. అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

“ఒక ముఖ్య‌మంత్రి, రాష్ట్రంలో ఒక కాన్ట్సిట్యూష‌న్ హెడ్‌నే ఇలా బోష్‌డీకే అంటూ.. మాట్లాడ‌తారా? ఇంక‌, ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డ ఉంది? ఇదేనా.. చంద్ర‌బాబు త‌న పార్టీ నేత‌ల‌కు నేర్పిస్తున్న మ‌ర్యాద‌?” అంటూ విరుచుకుప‌డ్డారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌ల‌పైనే నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అంటే.. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు రాజ్యాంగానికి హెడ్ అయిన‌ప్పుడు.. గ‌తంలో జ‌గ‌న్ కూడా ఇలాంటి మాట‌లే అన్నారు క‌దా.. మ‌రి అప్ప‌ట్లో .. కాన్ట్సిట్యూష‌న్ హెడ్ అన్న విష‌యం ఆయ‌న‌కు గుర్తుకు రాలేదా? అని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా నంద్యాల ఉప ఎన్నిక‌లో జ‌రిగిన ఘ‌ట‌ను వారు గుర్తు చేస్తున్నారు.

2017లో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లో బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న జ‌గ‌న్‌.. నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉద్దేశించి.. “ఈ ముఖ్య‌మంత్రిని బ‌హిరంగంగా కాల్చిచంపినా త‌ప్పులేద‌నిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. మ‌రి ఆనాడు.. సీఎంగా ఉన్న చంద్ర‌బాబు కాన్ట్సిట్యూష‌న్ హెడ్ గా జ‌గ‌న్ అనుకోలేదా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

త‌ర్వాత కూడా “ఈ చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రి అనాలా.. ముఖ్య‌కంత్రీ అనాలా?” అని ప్ర‌శ్నించారు. మ‌రి అప్పుడు.. బాబులో ‘రాజ్యాంగ పెద్ద‌’ క‌నిపించ‌లేదా? త‌ర్వాత‌.. అనేక సంద‌ర్భాల్లోనూ చంద్ర‌బాబును దూషించారు. మ‌రి అప్పుడు కూడా ఆయ‌న‌లో రాజ్యాంగ పెద్ద క‌నిపించ‌లేదా? అని నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు.

నొప్పి త‌న‌దాకా వ‌చ్చే స‌రికి.. జ‌గ‌న్‌కు ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకు వ‌చ్చింద‌నే కామెంట్లు నెటిజ‌న్లు ఎక్కువ మంది చేస్తున్నారు. సీఎంగా ఎవ‌రున్నా.. వారిని గౌర‌వ వాచ‌కంతో పిల‌వాల‌నే సంప్ర‌దాయం.. ఎవ‌రో చెబితో.. జ‌గ‌న్ వినక‌పోవ‌చ్చు.. కానీ… సాక్షాత్తూ.. ఆయ‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో, ఆయ‌న ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న టైంలో.. ఎక్క‌డా నోరు జార‌లేదు. ‘చంద్ర‌బాబు అలా అన్నారా?’ అనే వ్యాఖ్యానించేవారే త‌ప్ప‌.. ‘డా’ అనే ప‌దం కూడా వైఎస్ నోటి వెంట ఎప్పుడూ వ‌చ్చింది కాదు. ఇక‌, అసెంబ్లీలోనూ ఇదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేశారు.. త‌ప్ప‌.. ఎంత ఆగ్ర‌హం వ‌చ్చినా.. నోరు జారింది లేదు. అయినా.. ఇప్పుడు జ‌గ‌న్ .. సూక్తులు చెబుతూ… తాను తింటున్న‌ది గొంగ‌ళీలో అన్న‌మ‌న్న విష‌యాన్ని మ‌రిచిపోయార‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

This post was last modified on October 21, 2021 4:19 pm

Share

Recent Posts

నాగార్జున నమ్మకం ఎక్కడ తప్పింది

చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…

9 minutes ago

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

3 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

5 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

6 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

6 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

6 hours ago