బోష్ డీకే అంటే.. లం… కొడుకు: సీఎం జ‌గ‌న్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అధికారం దక్కలేదనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విపక్షాలను ఉద్దేశించి ఆరోపించారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందు కు కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసుల బాగోగుల గురించి ఆలోచిం చామన్నారు. పోలీసులు తమ కుటుంబాలతో గడపాలని.. వారికి కూడా విశ్రాంతి కావాలన్నారు. వీక్లీ ఆఫ్‌ను మొదటిసారిగా ప్రకటించిన ప్రభుత్వం తమదేనని చెప్పారు.

హోంగార్డులకు గౌరవ వేతనాన్ని కూడా పెంచామని.. కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా జగన్‌ మాట్లాడారు. కేవలం అక్కసుతో పథకం ప్రకారమే రాష్ట్రంలో కుట్రచేస్తున్నారని ఆక్షేపించారు. ‘‘కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకూ వెనకాడట్లేదు. అధికారం దక్కలేదనే ఈ విధంగా చేస్తున్నారు. చీకట్లో ఆలయా లకు సంబంధించిన రథాలను తగలబెడుతున్నారు. ఆఖరికి సీఎంపైనా అసభ్య పదజాలం వాడుతు న్నారు. ముఖ్యమంత్రిపై పరుష పదజాలం వాడటం సమంజసమేనా?“ అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. సీఎంను అభిమానించేవాళ్లు తిరగబడాలి.. భావోద్వేగాలు పెరగాలని వాళ్లు ఆరాటపడుతు న్నారు. వాళ్లు గెలవలేదని రాష్ట్రం పరువు తీసేందుకూ వెనుకాడట్లేదు. గిట్టనివాడు పరిపాలన చేస్తున్నా రని ఓర్వలేకపోతున్నారు’’ అని ధ్వజమెత్తారు. ఇదే స‌మ‌యంలోబోష్ డీకే అంటే.. లం… కొడుకు. అం టే.. సీఎంతోపాటు ఆయ‌న త‌ల్లిని కూడా దూషిస్తున్నారు“ అని గుట్టు విప్పేశారు. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. ఎలా? అని ప్ర‌శ్నించారు. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో రాజీ ప‌డేది లేద‌న్నారు. త‌న వారు.. మ‌న వారు అనే తేడా లేకుండా శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే వారిపై చర్య‌లు తీసుకోవాల‌ని.. జ‌గ‌న్ సూచించ‌డం గ‌మ‌నార్హం.

‘‘నేరాల్లో కొత్త కోణం కనిపిస్తోంది. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఆలయాల రథాలను తగలబెట్టారు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియాన్ని అడ్డుకున్నారు. చివరకు ముఖ్యమంత్రిని కూడా దారుణమైన బూతులు తిడుతున్నారు. ఇది కరెక్టేనా.. ఇలా తిట్టడం కరెక్టేనా.. ఆలోచించండి. సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడాలి.. తద్వారా గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. ఇది అనైతికం.. అధర్మం.. పచ్చి అబద్ధం’’ అని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

“దేశవ్యాప్తంగా నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే.. మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. ఈ అమరవీరులందరికి నేడు రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని సీఎం అన్నారు.