ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా పోలీసుల నుంచి షాకులు తప్పలేదు. టీడీ పీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు.. ఏకంగా.. చంద్రబాబును కూడా ముప్పుతిప్పలు పెట్టారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా.. చంద్రబా బు.. గురువారం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్ష చేపట్టిన విషయం తెలి సిందే. ఈ క్రమంలో తన నివాసం ఉండవల్లిలోని.. కరకట్ట నుంచి మంగళగిరి ఆఫీస్‌కు వచ్చేందుకు బయల్దేరిన చంద్రబాబును పోలీసులు దారిమళ్లించారు.
చంద్రబాబు వెళుతున్న కాన్వాయ్ మార్గాన్ని పోలీసులు మార్చారు. అదేసమయంలో సీఎం బయల్దేరడం తో మార్గం మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి వైపు కాకుండా మంగళగిరి మీదుగా చంద్రబాబు కాన్వా య్ మళ్లించారు. దీంతో రూట్ మారడంతో 20 నిమిషాలు ఆలస్యంగా చంద్రబాబు దీక్షాస్థలికి చేరుకున్నారు.
అయితే.. దీనిపై.. టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉండవల్లి సహా విజయవాడ లోనూ నాయకులు నిరసనకు దిగారు. ఉద్దేశ పూర్వకంగా.. చంద్రబాబు కాన్వాయ్‌ను దారి మళ్లించారని.. దీక్షను భగ్నం చేసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అయితే.. 8.40 నిమిషాలకు టీడీపీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు దీక్ష చేపట్టారు.
చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభమయ్యింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దుండగుల దాడి, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నేతలు, కార్యకర్తల దాడి యత్నాలకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పగిలిన అద్దాలు, ధ్వంసమైన సామగ్రి మధ్యే బాబు దీక్షకు కూర్చున్నారు.
నాయకులు, కార్యకర్తలు.. పెద్ద ఎత్తున ఆఫీస్‌కు చేరుకున్నారు. చాలా మంది ముఖ్య నేతలు.. నిన్న రాత్రికే విజయవాడ, మంగళగిరికి చేరుకున్నారు. అక్కడే బస చేసి.. ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, ఈ రోజు ఉదయం 8గంటలకు ప్రారంభం కావాల్సిన చంద్రబాబు దీక్ష ఆలస్యంగా మొదలయ్యింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates