టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. మంగళ వారం జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడిపై లోకేష్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డీతో సహా తాము చెల్లిస్తామని.. దేశం లో ఎక్కడ దాక్కున్నా..ఏ ఒక్కొరినీ వదిలిపెట్టేది లేదని.. స్పష్టం చేశారు. తమ ఓర్పు సహనాన్ని పరీక్షిస్తున్నారని అన్న లోకేష్.. వైసీపీ కుక్కలకు పోలీసులే సాయం చేస్తున్నారని.. నిప్పులు చెరిగారు.
టీడీపీ దేవాలయంపై దాడి చేస్తే.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, ఒకప్పుడు పోలీసులు ఆదర్శంగా ఉన్నారని… కానీ, ఇప్పుడు ఏపీ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. తమ కు వైసీపీ నేతల నుంచే కాకుండా.. పోలీసులు కూడా ఇబ్బందులు కల్పిస్తున్నారని అన్నారు. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా.. పోలీసులు సరిగా స్పందించలేదన్నారు. 24 గంటలైనా.. ఎందుకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోయారు? ఇది డీజీపి చేతకాని తనం కాదా? పోస్టింగుల కోసం గతంలో చంద్రబాబుకు ఫోన్ చేసిన విషయం గుర్తులేదా? అంటూ.. డీజీగౌతం సవాంగ్‌ను ప్రశ్నించారు.
బూతులకు కేరాఫ్ అడ్రస్ వైసీపీనే అంటూ.. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను లోకేష్ ఈ సందర్భంగా ప్రదర్శించారు. వైసీపీ నేతలకు కూడా డ్రగ్స్‌లో వాటాలు ఉన్నాయని అన్నారు. దాడులకు తాము భయపడేది లేదని తేల్చి చెప్పారు. సైకో రెడ్డికి భాస్కర్ అవార్డు ఇవ్వాలని.. ముఖ్యమంత్రిని ఎద్దేవా చేశారు. గతంలో చంద్రబాబు కాలర్ పట్టుకోవాలని అన్నప్పుడు పోలీసులకు కనిపించలేదా?.. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపాలని అన్నప్పుడు పోలీసులు ఏం చేశారు? అని ప్రశ్నించారు.
డ్రగ్స్ ఎక్కడ దొరికినా.. ఏపీలోనే మూలాలు ఉంటున్నాయన్న లోకేష్.. ఇదే విషయాన్ని హైదరాబాద్ పోలీసులు చెబుతున్నారని.. మహారాష్ట్ర పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నారని.. అయినా.. ఏపీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని.. ఇదే విషయాన్ని తాము ప్రశ్నిస్తే.. దాడులు చేస్తారా? అని నిలదీశారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసినప్పుడే కఠిన సెక్షన్లు పెట్టి ఉంటే.. ఇంత దూరం వచ్చేది కాదని అన్నారు. 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని లోకేష్ వ్యాఖ్యానించారు. అప్పుడు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని.. వైసీపీ నేతలను హెచ్చరించారు.
చంద్రబాబుకు ఓపిక ఎక్కువని.. కానీ, తాను మాత్రం అలా కాదని.. లోకేష్ చెప్పుకొచ్చారు. జగన్ సైకో శాడిస్ట్ అనుకున్నాం.. అది నిన్నటితో నిర్ధారణ అయిందని.. లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగే 15 నిమిషాల ముందుగానే.. తాము పోలీసులకు సమాచారం ఇచ్చామని… అయితే.. ఏ ఒక్కరూ రాలేదని.. అందుకే ఆ పోలీసులు తాము ప్రశ్నించామని.. లోకేష్ చెప్పుకొచ్చారు.
This post was last modified on October 20, 2021 11:51 pm
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…