ట్విస్టులతో సాగుతూ మలుపులు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేలు ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఏకగ్రీవం అవుతుందనుకున్న ఈ ఎన్నికలో ఇప్పుడు ప్రధానంగా అధికార వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పోటీలో నిలిచాయి. వైసీపీ నుంచి దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ బీజేపీ నుంచి విద్యార్థి నాయకుడు సురేశ్ కాంగ్రెస్ నుంచి పీఎం కమలమ్మ బరిలో దిగారు. అక్టోబర్ 30నే పోలింగ్ ఉండడంతో ఇప్పటికే ప్రచారాన్ని అన్ని పార్టీలు హోరెత్తించాయి. ఈ ఎన్నికలో వైసీపీదే విజయం నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ బీజేపీతో పాటు కాంగ్రెస్ తమ సత్తాచాటాలనే పట్టుదలతో ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో పోటీ చేయడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.
చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే వైసీపీ టికెట్ ఇవ్వడంతో రాజకీయ విలువలను పాటించి పోటీకి దూరంగా ఉంటున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సంప్రదాయాన్ని పాటిస్తూ టీడీపీ కూడా పోటీ నుంచి తప్పుకుంది. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అనిపించింది. కానీ వారసత్వ రాజకీయాల వద్దంటూ బీజేపీ పోటీకి సై అంది. కాంగ్రెస్ కూడా బరిలో నిలిచింది. మరి టీడీపీ జనసేన పోటీలో లేనపుడు ఆ పార్టీ అభిమానులు అనుచరులు కార్యకర్తలు ఓట్లు ఎవరికి పడతాయానే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేశారనే కోపంతో ఏపీ ప్రజలు కాంగ్రెస్‌కు రాష్ట్రంలో నామరూపల్లేకుండా చేశారు. వరుసగా రెండు ఎన్నికల్లోనూ ఆ పార్టీ దారుణమైన ఫలితాలు మూటగట్టుకుంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత ఆ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరుతో ఆయన తనయుడు జగన్ వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ కీలక నేతలందరూ ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత పార్టీ పాతాలానికి పడిపోయింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ పార్టీ బలోపేతంపై ఎలాంటి దృష్టి సారించడం లేదనే అభిప్రాయాలున్నాయి.
ఈ పరిస్థితుల్లో బద్వేలులో కాంగ్రెస్ పోటీ చేయడం వెనక మరో ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన పోటీలో లేవు కాబట్టి అధికార వైసీపీ వ్యతిరేక ఓట్లను పొంది కనీసం డిపాజిట్ తెచ్చుకుని రాష్ట్రంలో పార్టీ ఇంకా బతికే ఉందని చాటి చెప్పడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన రాజశేఖర్‌కు 50 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు టీడీపీ పోటీలో లేదు. దానితో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం సాగుతున్న జనసేన కూడా బరిలో లేదు. ఇక బీజేపీతో బంధం తెచ్చుకునేందుకు జనసేన సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఆ టీడీపీ ఓట్లు బీజేపీకి పడడం కష్టమే. ఈ నేపథ్యంలో మిగిలింది ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి గత ఎన్నికలతో (2337 ఓట్లు) పోలిస్తే ఈ సారి మెరుగ్గానే ఫలితం దక్కే వీలుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on October 22, 2021 9:26 am
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…
రాజాసింగ్... రాజకీయాల పట్ల కనీస పరిచయం ఉన్నవారికి ఎవరికైనా ఈ పేరు గురించి, ఈ నాయకుడి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.…
వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యరమైన పోస్టులు…
ఈ రోజు సోషల్ మీడియా అంతటా ధనుష్-నయనతార గొడవ గురించే చర్చ. ధనుష్ మీద తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ నయనతార…