మాజీ ముఖ్యమంత్రి, కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. తొందరలోనే సొంతంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలో తొందరలో జరగబోతున్న సమయంలో కెప్టెన్ సొంత పార్టీ పెట్టే విషయాన్ని ప్రకటించటంతో కాంగ్రెస్ పార్టీకి దిక్కుతోచటం లేదు. తనను అవమానకరమైన రీతిలో ముఖ్యమంత్రి పదవి నుండి దింపేసిన కాంగ్రెస్ అధిష్టానం మీద కెప్టెన్ మండిపోతున్నారు.
అలాగే తన నిష్క్రమణకు కారణమైన పీసీసీ ప్రెసిడెంట్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ అంటే కూడా మాజీ సీఎం మండిపోతున్నారు. సిద్ధూని వచ్చే ఎన్నికల్లో గెలవనిచ్చేది లేదని గతంలోనే అమరీందర్ శపథం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఒకేసారి రెండు పిట్టలను కొట్టాలన్నట్లుగా అమరీందర్ ప్లాన్ చేస్తున్న విషయం అర్ధమైపోయింది. దీనికి తాను సొంతంగా పార్టీ పెడితేనే సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు.
అందుకనే తన మద్దతుదారులతో కలిసి కొత్త పార్టీని పెట్టేందుకు రెడీ అవుతున్నారు. నిజంగానే అమరీందర్ పార్టీ పెడితే మందుగా దెబ్బపడేది కాంగ్రెస్ పార్టీ మీదే. ఎలాగంటే కాంగ్రెస్ లోని కెప్టెన్ మద్దతుదారులంతా ముందుగా బయటకు వచ్చేస్తారు. అలా వచ్చేసిన వారంతా చేరేది కెప్టెన్ కొత్త పార్టీలోనే అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో హఠాత్తుగా దెబ్బపడుతుంది.
సరిగ్గా ఎన్నికల ముందు సీనియర్లు, మంత్రులు, సిట్టింగ్ ఎంఎల్ఏలు పార్టీని వదిలేస్తే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పవు. ఇదే సమయంలో కెప్టెన్ కొత్తపార్టీ సీనియర్ నేతలతో ఒక్కసారిగా బలోపేతమవుతుంది. దీంతో పాటు బీజేపీ మీద జనాల్లో విపరీతమైన వ్యతిరేరకత ఉంది. రేపటి ఎన్నికల్లో వీళ్ళంతా బీజేపీ తరపున పోటీచేస్తే గెలవటం కూడా కష్టమే. అందుకనే కమలనాదుల్లో కొందరు తమపార్టీకి రాజీనామాలు చేసి కెప్టెన్ పార్టీలో చేరితో మరింతగా బలపడుతుంది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నాలుగు పార్టీల మధ్య తీవ్రంగా ఉంటుంది.
ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు బీజేపీ+శిరోమణి అకాలీదళ్, ఇంకోవైపు ఆప్ చివరకు కెప్టెన్ పెట్టబోయే కొత్తపార్టీ. నాలుగు పార్టీల్లో జనాలు దేన్ని ఆదరిస్తారో కాస్త అయోమయంగానే ఉంది. అయితే ఇప్పటివరకు జరిగిన సర్వేల ప్రకారమైతే ఆప్ కు మంచి ఛాన్స్ ఉందంటున్నారు. సరే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దెబ్బతినేది మాత్రం కాంగ్రెస్ అని అనుకుంటున్నారు. బహుశా ఇదంతా సిద్ధూ చేసిన కంపువల్లేనేమో. చూద్దాం చివరకు ఏమవుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates