వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌కు శనిదోషం పట్టిందా? వచ్చే రెండు సంవత్సరాలు ఇబ్బందులు తప్ప వా? ఆయన ఎంతో ఆరాధించే ఓ స్వామి
ఇదే విషయాన్ని హెచ్చరించారా? అంటే.. వైసీపీ వర్గాల్లో ఇదే గుసగుస వినిపిస్తోంది. కీలక నేతలు సైతం.. హాట్ టాపిక్‌గా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. దీనికి.. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చేస్తున్న పనులు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. తరచుగా.. ఆయన తిరుమల శ్రీవారి ప్రసాదం తెప్పించుకుని స్వీకరిస్తున్నట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
అదే విధంగా ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలోనూ ఎంతో భక్తిశ్రద్ధలతో పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక, బెజవాడ దుర్గమ్మ ఆలయానికి స్వయంగా వెళ్లి.. పట్టు వస్త్రాలు సమర్పించారు. వాస్తవానికి గత ఏడాది.. సీఎం స్థానంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావే.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కానీ, ఈ ఏడాది ముఖ్యమంత్రే స్వయంగా వెళ్లడం గమనార్హం. ఇక.. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా దర్శించని.. విజయవాడలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లడం.. మరింతగా ఈ వాదన కు బలం చేకూరుస్తోంది.
ఆశ్రమంలోని గణపతికి ప్రత్యేక పూజలు చేసిన జగన్.. అదే సమయంలో మర కత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని వస్త్రాలు సమర్పించారు. నిజానికి ఇప్పటి వరకు ఏ ముఖ్య మంత్రి ఇలా గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వచ్చింది లేదు. ఇప్పుడు జగన్ కొత్త సంప్రదాయానికి తెరదీశారా? అంటే అదేం లేదు. కేవలం ఆయనకు ప్రియమైన స్వామి సూచనల మేరకు గణపతి పూజలకు హాజరయ్యారని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. ప్రస్తుతం జగన్ జాతకం ప్రకారం దోషం నడుస్తోందనే గుసగుస వినిపిస్తోంది.
ఈ దోషం కారణంగానే జగన్ ఎంత అద్భుతమైన పాలన అందిస్తున్నానని చెబుతున్నా.. చాపకింద నీరులా వ్యతిరేకత పెరుగుతుండడం. కేంద్రం నుంచి సరైన సహకారం లేక పోవడం.. వంటివి కనిపిస్తున్నాయని.. అదే సమయంలో రాష్ట్రంలోనూ విపక్షాల ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందనే చర్చ సాగుతోంది. ఆర్థికంగా సమస్యలు చుట్టుముట్టడం.. ప్రతి నెలా డబ్బుల కోసం ఎదురు చూడడం వంటివి కామన్ గా మారిపోయిందని.. సీఎం జగన్ జాతకంలో శని ప్రభావం కారణంగానే ఇలా జరుగుతోందని.. అందుకే ఆయన ఇటీవల కాలంలో ఆలయాల చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు. మరి చూడాలి.. జగన్‌ను ఏ దేవుడు కరుణిస్తాడో!!
This post was last modified on October 18, 2021 1:45 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…