Political News

ఒకే కీల‌క‌నేత‌పై వ‌ల విస‌రుతోన్న టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌…!


తెలంగాణ‌లో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయ‌న్న‌ది మాత్రం క్లారిటీ వ‌చ్చేసింది. ఈ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిస్తే ఒకలా.. టీఆర్ఎస్ గెలిస్తే మ‌రోలా తెలంగాణ రాజ‌కీయం మారుతుంది. ఇక ఇక్క‌డ కాంగ్రెస్ గెల‌వ‌క‌పోయినా రెండో ప్లేసులో ఉన్నా కూడా మ‌రో స‌రికొత్త రాజ‌కీయాన్ని మ‌నం చూస్తాం. ఇదిలా ఉంటే తెలంగాణ‌లో ఓ కీల‌క రాజ‌కీయ నేత‌పై ఇప్పుడు అధికార టీఆర్ఎస్‌తో పాటు విప‌క్ష కాంగ్రెస్ వ‌ల వేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ నేత ఎవ‌రో కాదు పెద్ద‌ప‌ల్లి మాజీ ఎంపీ వివేక్‌.

కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగింది వివేక్ కుటుంబం. వివేక్ 2009లో పెద్ద‌ప‌ల్లి నుంచి ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం చూసి ఆ పార్టీలో చేరారు. చివ‌ర‌కు కాంగ్రెస్ ప్ర‌త్యేక తెలంగాణ ఇవ్వ‌డంతో ఎన్నిక‌ల‌కు ముందే మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి రివ‌ర్స్ జంప్ చేశారు. కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి బాల్క సుమ‌న్ చేతిలో ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావ‌డంతో మ‌ళ్లీ మ‌రోసారి ఆ పార్టీ కండువా క‌ప్పుకున్నారు. కేసీఆర్ కూడా వివేక్‌కు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ప‌ద‌వి ఇచ్చారు.

2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కేసీఆర్ వివేక్‌కు టిక్కెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న మ‌రోసారి బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. ఆయ‌న పారిశ్రామిక వేత్త‌, పైగా ఆయ‌న చేతిలో వీ 6 మీడియా ఉంది. ఇప్పుడు బీజేపీలో ఉన్నా ఆయ‌న్ను ఆ పార్టీ వాడుకుంటోందే త‌ప్పా ఆయ‌నకు ఏ మాత్రం ఉప‌యోగం లేదు. ఈ విష‌యంపై ఆయ‌న క్లారిటీతో ఉన్నారు. దీంతో మ‌రోసారి ఆయ‌న కండువా మార్చేందుకు టైం కోసం వెయిట్ చేస్తున్నార‌ట‌.

వివేక్ అసంతృప్తిని గ‌మ‌నించిన టీఆర్ఎస్ ఆయ‌న్ను పార్టీలోకి ఆహ్వానించే పనిలో ఉందంటున్నారు. పార్టీలోకి వ‌స్తే రాజ్య‌స‌భ ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేస్తోంద‌ట‌. మ‌రోవైపు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సైతం వివేక్‌ను పార్టీలోకి తీసుకుని ఆయ‌న‌కు పెద్ద‌ప‌ల్లి ఎంపీ సీటుతో పాటు ఆయ‌న త‌న‌యుడు వినోద్‌కు అసెంబ్లీ సీటు ఇవ్వ‌డంతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని చెపుతున్న‌ట్టు తెలుస్తోంది. ద‌శాబ్దాల పాటు కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న వివేక్ కుటుంబాన్ని వ‌దులుకోమ‌ని రేవంత్ చెపుతున్నార‌ట‌. మ‌రి వివేక్ ఈ ఆఫ‌ర్ల‌పై ప్ర‌స్తుతానికి సైలెంట్‌గా ఉన్నా ఏదో ఒక నిర్ణ‌యం అయితే తీసుకుంటార‌నే అంటున్నారు.

This post was last modified on October 16, 2021 1:42 pm

Share

Recent Posts

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

1 hour ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

2 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

2 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

5 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

5 hours ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

6 hours ago