Political News

మావోయిస్టు అగ్ర నేత‌.. ఆర్కే మృతి!

మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హ‌ర‌గోపాల్‌.. అలి యాస్‌ రామకృష్ణ.. అలియాస్ ఆర్కే తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. దక్షిణ బస్తర్ అటవీ ప్రాం తంలో అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆర్కే బాధపడుతున్నారని స‌మాచారం. ఆయన కరోనాతో మృతి చెందినట్లు, అంత్యక్రియలు కూడా పూర్తైనట్లు అధికారులు పోలీసు లు ప్రకటించారు. ఆయన తుదిశ్వాస విడవడంతో మావోయిస్టు పార్టీ పెద్ద దిక్కును కోల్పోయినట్టయింది.

మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతి చెందారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుకుమా-బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఆర్కే అనారోగ్యంతో చనిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధృవీకరించారు. ఆర్.కె 4 ద‌శాబ్దాలుగా.. మావోయిస్టులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు కేసుల్లో ఆర్కే ప్రధాన సూత్రధారుడిగా ఉన్నారు. మాజీ సీఎం చంద్రబాబుపై దాడి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆయనకు బుల్లెట్ గాయం అయింది.

2004 అక్టోబర్ 15న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆర్కే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేపై రూ.50 లక్షల రివార్డును పోలీస్ శాఖ గతంలో ప్రకటించింది. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఆర్కే కొనసాగారు. సౌత్‌లో మావోయిస్టు పార్టీ బలోపేతానికి తీవ్రంగా పోరాటం చేశారు రామకృష్ణ. ఏపీ, తెలంగాణలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలు దఫాలుగా పోలీసుల నుంచి తప్పించుకు న్నారు.

మావోయిస్ట్ దళంలో వ్యూహ ర‌చ‌న చేయ‌డంలో రామకృష్ణ దిట్ట. అనేక మార్లు పోలీసుల నుంచి తప్పుకున్న రామకృష్ణ.. అనారోగ్యంతో మృతి చెందారు. నాలుగేళ్ల క్రితం బలిమెల ఎన్‌కౌంటర్‌లో ఆయనకు బుల్లెట్ గాయం అయింది. నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఆర్కే కొనసాగారు. సౌత్‌లో మావోయిస్టు పార్టీ బలోపేతానికి తీవ్రంగా పోరాటం చేశారు రామకృష్ణ. కరోనా మావో దళానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. రామకృష్ణను కూడా కరోనానే మింగింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ముప్పు తిప్పలు పెడుతున్న క్రమంలో పోలీసులు.. మావోయిస్ట్‌లకు అప్పీల్ చేశారు. లొంగిపోతే.. వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. కాని ఈ పిలుపునకు కొందరే స్పందించారు. మావో దళంలో 20 ఏళ్లుగా యాక్టివ్‌గా పని చేస్తున్నారు రామకృష్ణ. ఈ మధ్య కాలంలో సైలెంట్‌గా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఆర్‌కే చనిపోవడం కలకలం రేపింది. మరో నేతను ఆయన స్థానంలో నియమించాక.. ఆర్‌కే మృతిని మావోయిస్ట్‌లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

This post was last modified on October 15, 2021 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

3 hours ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

4 hours ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

5 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

6 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

7 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

7 hours ago