రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నిక వచ్చింది. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఇక్కడ వైసీపీ నాయకుడు మృతి చెందడంతో వచ్చిన ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి గెలిచారు. అయితే.. ఇక్కడ.. వైసీపీ పెట్టుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు.
భారీ మెజారిటీతో ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాల ని.. దేశం మొత్తం.. తిరుపతి వైపు చూడాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. కానీ, అది సాధ్యం కాలేదు. దీనికి ప్రధాన కారణం.. అన్ని వైపుల నుంచి టీడీపీ, జనసేన-బీజేపీ కూటమి పోటీకి దిగడమే. అదే సమయంలో ప్రచారం జోరెత్తించడమే..!
సరే.. ఇప్పుడు ఏకంగా..ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని ఎస్సీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిం ది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ కూడా వైసీపీ భారీ మెజారిటీనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలు స్తోంది. దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. బద్వేల్‌లో వైసీపీ వరుస విజయాలు దక్కించు కుంటోంది.
గత ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ వెంకట సబ్బయ్య అకాల మరణం చెందారు. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక, 2014లో 9 వేల పైచిలుకు వచ్చిన వైసీపీ మెజారిటీ గత 2019లో ఏకంగా 44 వేల పైచిలుకు ఓట్లకు చేరింది.
ఇదే ఇప్పుడు వైసీపీలో అంచనాలు పెంచుతోంది. అధికారంలో లేనప్పుడే.. గత ఎన్నికల్లో 44 వేల పైచిలుకు ఓట్లు దక్కించుకున్నప్పుడు.. ఇప్పుడు లక్ష ఓట్లు మెజారిటీ ఎందుకు దక్కించుకోలేం అనేది వీరి ధీమాగా కనిపిస్తోంది.
This post was last modified on October 4, 2021 3:43 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…