దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వారెవరిలో కనిపించని విలక్షణ కోణాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిలో కనిపిస్తాయి. దేశంలోని సీఎంల గురించి అవగాహన లేకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ సీఎంలుగా వ్యవహరించిన వారికి కాస్త గుర్తు తెచ్చుకోండి. వారెవరిలో లేని చాలా కోణాలు కేసీఆర్ లో కనిపిస్తాయి.
ప్రజలతోనూ.. పార్టీ నేతలతోనూ పరిమితంగా సంబంధాలు పెట్టుకునే ఆయన తీరు తరచూ చర్చనీయాంశంగా ఉంటుంది. అయితే.. తనను విభేదించే వారి చేత కూడా మొనగాడ్రా భయ్ అన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ లో కనిపించే ఫ్యామిలీ మెన్ మరే ముఖ్యమంత్రిలోనూ కనిపించదని చెప్పాలి.
కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవానికి సతీసమేతంగా వెళ్లిన ఆయన.. ఆమె పక్కన కూర్చోవటమే కాదు.. ఆమెకు అక్కడి విశేషాల్ని తానే స్వయంగా చెప్పే తీరు చూస్తే ముచ్చటపడాల్సిందే. తానో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయం కంటే కూడా తన జీవితభాగస్వామి విషయంలో ఆయన ప్రదర్శించే శ్రద్ధను చూసినోళ్లంతా ఫిదా అవుతుంటారు.
ఏదైనా ప్రోగ్రామ్ కు శ్రీమతిని తీసుకొచ్చే ముఖ్యమంత్రులే తక్కువ అయితే.. అలా తీసుకొచ్చిన తర్వాత.. ఆమెకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు వహిస్తూ.. ఆమెకు బోర్ కొట్టకుండా తనతో పాటుగా తీసుకెళ్లే తీరు చూస్తే.. పర్ ఫెక్ట్ ఫ్యామిలీమెన్ కు కేరాఫ్ అడ్రస్ గా కేసీఆర్ కనిపిస్తారు. ఇవాల్టి రోజున చాలా మీడియా సంస్థలు తాము ప్రచురించిన ఫోటోల్లో కేసీఆర్ లోని మరో కోణాన్ని చూపించే ఈ ఫోటోను ప్రత్యేకంగా ప్రచురించటాన్ని చెప్పక తప్పదు.
This post was last modified on May 30, 2020 4:56 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…