Political News

సైకిల్ సెన్సేష‌న్.. ఇంటి ప‌క్క‌న టెంటు వేయాల్సొచ్చింది

జ్యోతికుమారి.. ఈ మ‌ధ్య కాలంలో మీడియాలో సెన్సేష‌న్‌గా మారిన పేరు. లాక్ డౌన్ టైంలో ప్ర‌జా ర‌వాణా లేక‌పోవ‌డంతో ఢిల్లీలోని గుర్గావ్ నుంచి బీహార్లోని సిరిహులి వ‌ర‌కు త‌న తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టి తొక్కుకుంటూ వ‌చ్చిందీ టీనేజీ అమ్మాయి. ఏకంగా 1200 కిలోమీట‌ర్ల దూరం ఆమె సాహ‌స యాత్ర సాగింది.

దీనిపై మీడియాలో వార్త‌లు రావ‌డంతో జ్యోతి పేరు మార్మోగిపోయింది. ఆమె గురించి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ట్వీట్ వేసింది. ఆమెకు సాయం చేయ‌డానికి ప‌లు సంస్థ‌లు ముందుకొచ్చాయి. భార‌త సైక్లింగ్ స‌మాఖ్య ఆమెకు శిక్ష‌ణ ఇస్తామ‌ని కూడా ప్ర‌క‌టించింది. ఈ ఉదంతంతో జ్యోతి నేష‌న‌ల్ సెల‌బ్రెటీ అయిపోయింది.

ఆమెను చూడ‌టానికి రోజూ 40-50 మంది త‌న ఇంటికి వెళ్తున్నార‌ట‌. త‌మ‌ది చిన్న ఇల్లు కావ‌డం, క‌రోనా భ‌యం కూడా ఉండ‌టంతో జ్యోతి ఇంటి ప‌క్క‌నే ఒక టెంట్ వేసి వ‌చ్చిన అతిథుల్ని అందులోకి ఆహ్వానించి జ్యోతి వారితో ముచ్చ‌టిస్తోంద‌ట‌. తాను అమ్మాయిని కాబ‌ట్టే తాను చేసిన సాహ‌సానికి అంత గుర్తింపు వ‌చ్చింద‌ని జ్యోతి అంటోంది. తన తల్లికి ఇచ్చిన మాట కోసం తన తండ్రిని అంత దూరం తీసుకొచ్చానని.. లాక్ డౌన్ వ‌ల్ల ఎంతోమంది పరిస్థితి ఇలాగే ఉందని జ్యోతి చెప్పింది.

జ్యోతి కోసం ఉద‌యం ఏడు నుంచే త‌న ఇంటికి జ‌నాలు వ‌స్తున్నారు. రాత్రి ఎనిమిది వ‌ర‌కు ఇలా అతిథుల‌తోనే ఆమె ఇల్లు నిండిపోతోంది. దీనిపై జ్యోతి తండ్రి మాట్లాడుతూ.. “మా ఇల్లు చాలా చిన్న‌ది. అందుకే ప‌క్క‌నే చిన్న టెంట్ వేశాం. వ‌చ్చిపోయే వాళ్ల వ‌ల్ల క‌రోనా సోకుతుంద‌న్న భ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రినైనా రావొద్ద‌ని అంటే మాకు గ‌ర్వం వ‌చ్చింద‌ని అనుకుంటారు. అందుకే ప‌క్క‌నే ఓ టెంట్ వేశాం. అంద‌రూ అక్క‌డికి వ‌చ్చి మా అమ్మాయిని ఆశీర్వ‌దించొచ్చు’’ అని జ్యోతి తండ్రి మోహ‌న్ పాస‌వాన్ అన్నాడు.

This post was last modified on May 30, 2020 10:01 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

3 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

4 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

8 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

8 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

8 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

9 hours ago