ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసిన సీఎం జగన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ టూర్ కి వెళుతున్నారు. రేపటి నుంచి కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిమ్లా పర్యటన చేయనున్నారు.

రేపు మధ్యాహ్నం 12.30 కు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ…. మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం నుంచి చండీగఢ్ కు బయలుదేరనుంది. ఇక రేపు సాయంత్రం నాలుగు గంటలకు సిమ్లా లోని ఒబెరాయ్ హోటల్ కు జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేరుకోనుంది.

ఈ నెల 28న జగన్, భారతిల పెళ్లి దినోత్సవం ఉంది. పెళ్లి అయ్యి 25 ఏళ్ళు అయిన నేపథ్యంలో ఐదు రోజుల పాటు కుటుంబంతో గడపనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. కాగా ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అక్రమ ఆస్తుల బెయిల్ రద్దు అంశంపై సీబీఐ కోర్టు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.

ఈ విచారణ సందర్భంగా సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ బెయిల్ను రద్దు అంశంపై వచ్చే నెల 15వ తేదీన తీర్పు ప్రకటిస్తామని వెల్లడించింది.