తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాతుకుపోతున్నారు. అధ్యక్షునిగా నియమితులైనపుడు కూడా రేవంత్ కు పార్టీలోని సీనియర్లలో ఎంతమంది సహకరిస్తారు ? పార్టీ శ్రేణులు ఎలా రిసీవ్ చేసుకుంటాయో అని కొందరు సందేహాలు వ్యక్తంచేశారు. అయితే తాజాగా హైదరాబాద్ శివార్లలోని రావిర్యాల ప్రాంతంలో జరిగిన బహిరంగసభలో జనస్పందన చూసిన తర్వాత రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా పాతుకుపోయినట్లు అర్ధమైపోయింది. రేవంత్ కు సోనియా, రాహుల్ తో పాటు ప్రియాంక ఆశీస్సులు కూడా ఉండటం అతి పెద్ద ప్లస్ పాయింట్.
ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో రేవంత్ అంటే మంచి క్రేజుంది. యువకుడు, మంచి వాగ్ధాటి కలిగివుండటం, తెలుగుతో పాటు హిందీలో కూడా అనర్గళంగా మాట్లాడటం సానుకూలాంశమే. కేసీఆర్ వ్యతిరేకంగా చిత్తశుద్దితో నూరుశాతం పోరాటం చేస్తాడనే ప్రచారం కూడా సానుకూలంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో చిత్తశుద్దితో ఎంతమంది సీనియర్ లు పోరాటాలు చేస్తున్నారనే విషయంలో చాలామందిలో అనుమానులున్నాయి.
ఇలాంటి నేపధ్యంలోనే రేవంత్ కు ఏఐసీసీ అగ్రనేతలు పగ్గాలు అప్పగించటంతో ఇష్టం ఉన్నా లేకపోయినా చాలామంది నేతలు సహకరిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నేతలు ముందు కాస్త వ్యతిరేకించినా ఇపుడు పూర్తి మద్దతు ప్రకటించడం తో రేవంత్ కు తిరుగులేకుండా పోయింది. ఈ దృశ్యమే రావిర్యాల సభలో కనబడింది. పెద్ద వర్షం కురుస్తున్నా సభకు హాజరైన కార్యకర్తలు, జనాల్లో ఎవరు కూడా సభ నుంచి బయటకు వెళ్ళిపోలేదు. వర్షంలో తడుస్తునే రేవంత్ ప్రసంగాన్ని వినడం గొప్పనే చెప్పాలి.
ఇంతకుముందు ఆదిలాబాద్ లో ఎస్సీ, ఎస్టీల కోసం నిర్వహించిన బహిరంగ సభ కూడా బాగానే సక్సెస్ అయ్యింది. కేసీయార్ కుటుంబాన్ని విమర్శించడంలో చూపిస్తున్న దూకుడు, చెప్పదలచుకున్నది జనాలకు నేరుగా, స్పష్టంగా చెప్పటమే రేవంత్ కున్న అతిపెద్ద బలం. పైగా ప్రత్యర్ధులపై ఆరోపణలు చేసేటపుడు, విమర్శలు చేసేటపుడు రేవంత్ స్పీచ్ లో మంచి ఫ్లో ఉంటుంది. కేసీయార్ కు వ్యతిరేకంగా చిత్తశుద్దితో పోరాటం చేస్తున్నాడు, పార్టీనేతలను నడిపించగలడనే నమ్మకం ఉంటే శ్రేణులందరు కలిసివస్తారనటంలో సందేహంలేదు. కాబట్టే పీసీసీ ప్రెసిడెంట్ గా రేవంత్ పాతుకుపోతున్నారనే చెప్పాలి.
This post was last modified on August 20, 2021 3:11 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…