తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు ఎవరు? పార్టీని నడిపించే రథసారధి ఎవరు? వయసు మీద పడుతోన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానంగా లోకేశ్ పేరు చెప్తే.. ఆయన వల్ల ఏమీ కాదని రాజకీయ పరిజ్ణానం లేదని ఎప్పుడు ఏం మాట్లడతారో తెలీదని ఇలా మొన్నటివరకూ రకరకాల వ్యాఖ్యలు వినిపించేవి. సొంత పార్టీ నాయకులే లోకేశ్‌ను నమ్మే పరిస్థితిల్లో లేరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్లే కనిపిస్తోంది.
టీడీపీ భవిష్యత్ నాయకుడిగా లోకేశ్ తన ప్రయాణాన్ని తన ప్రస్థానాన్ని మెరుగ్గా మార్చుకుంటున్నట్లే కనిపిస్తున్నారు. పార్టీ బాధ్యతలను భుజాల మీద వేసుకునేందుకు సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం 71 ఏళ్లున్న చంద్రబాబు నాయుడు 2023 ఎన్నికల తర్వాత రాజకీయాలకు ప్రత్యక్షంగా దూరమయ్యే అవకాశాలున్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయన వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన లోకేశ్‌పై పార్టీ బాధ్యతలు మోపేందుకు అన్ని రకాలుగా బాబు ప్రయత్నిస్తున్నారు. కానీ విషయ పరిజ్ణానం ఎక్కువగా లేకపోవడం వాగ్ధాటి తక్కువ కావడం ఆరోపణలు విమర్శల్లో పదును లేకపోవడంతో లోకేశ్ ఇప్పటివరకూ నాయకుడని అనిపించుకోలేదు. ప్రత్యర్థి పార్టీ నాయకులు కూడా ఆయన్ని పప్పు అని విమర్శించడం తెలిసిందే.
2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఎంపికై ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టిన లోకేశ్‌కు 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఆయన్ని చిత్తుగా ఓడించారు. దీంతో లోకేశ్ పని అయిపోయినట్లేనని అంతా అనుకున్నారు.
కానీ ఇటీవల లోకేశ్ దూకుడు చూస్తే ఆయన రాజకీయంగా పరిణతి చెందుతున్నాడనే విషయం అర్థమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విషయంలో అధికార ప్రభుత్వ వైఫల్యాలను సమర్థంగా ఎండగడుతున్న ఆయన.. నిరుద్యోగ సమస్య, పరీక్షల రద్దు అంశాల్లో తన వాయిస్‌ను గట్టిగానే వినిపించారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో ఏపీలో ఈ ఏడాది పది, ఇంటర్ పరీక్షలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయక తప్పలేదు. ఇది లోకేశ్ సాధించిన విజయంగా టీడీపీలో కొత్త హుషారు వచ్చింది. దీంతో ఆయన కూడా విమర్శల్లో పదును పెంచారు. ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు, విమర్శల్లో దూకుడు పెంచారు. ఇటీవల గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శంచేందుకు వెళ్లిన ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ జీవితంలో తొలిసారి అరెస్టయిన లోకేశ్ ఇప్పుడు మరింత వేగంగా ముందుకు సాగుతున్నారు.
ఇప్పుడు వైసీపీ కూడా లోకేశ్‌ను పరిగణలోకి తీసుకోవడం కూడా ఆయనకు కలిసొస్తుంది. ఆ తర్వాత కర్నూలు వెళ్లిన ఆయన్ని అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడం తెలిసిందే. దీంతో లోకేశ్‌కు మరింత మేలే జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ప్రైవేటు ఉపాధ్యాయులకు కేసీఆర్ ప్రభుత్వం సాయం ప్రకటించినట్లుగా.. ఏపీలోనూ వైసీపీ ప్రభుత్వం వాళ్లను ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. లేఖ రాసి జగన్‌కు ఇరకాటంలోకి నెట్టారు. ఒకవేళ జగన్ ప్రైవేటు ఉపాధ్యాయులకు సాయం చేస్తే దాని ఫలితం లోకేశ్ ఖాతాలో చేరుతుంది. ఒకవేళ చేయకపోతే ఇదే విషయంపై జగన్ సర్కారును లోకేశ్ విమర్శిస్తూనే ఉండొచ్చు. మొత్తంగా ఏ రకంగా చూసుకున్నా లోకేశ్ మాత్రం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోందని రాజకీయ వేత్తలు అంటున్నారు.
This post was last modified on August 21, 2021 9:44 am
సంక్రాంతి దసరా తర్వాత తెలుగులో సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న సీజన్ అంటే.. క్రిస్మసే. క్రిస్మస్ సెలవుల్లో వచ్చే రెండు…
వచ్చే ఏడాది ఏప్రిల్ 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న ది రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్తలు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో…
అంతర్జాతీయగా మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్‌ల్లో.. ‘స్క్విడ్ గేమ్’ ఒకటి. ఈ కొరియన్ వెబ్ సిరీస్ మూడేళ్ల…
‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ నినాదంతో పార్లమెంటులో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2027లో సార్వత్రిక ఎన్నికలు,…
ఆంధ్రప్రదేశ్‌ను ఐదేళ్ల పాటు పాలించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు. వైసీపీ…