రాజకీయ పార్టీల్లో టెన్షన్ పెంచేస్తున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడ్రస్ ఎక్కడా కనబడలేదు. ఉపఎన్నికలో తన స్టాండ్ ఏమిటో కూడా ఇంతవరకు జనసేన అధికారికంగా ప్రకటించలేదు. ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలీదు కానీ ఈ రోజే రేపో నోటిఫికేషన్ వచ్చేస్తోందన్నంతగా నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగిపోతోంది. అన్నీ పార్టీలు హుజూరాబాద్ కేంద్రంగా ఏదో కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇంతటి కీలక సమయంలో జనసేన పార్టీ ఉనికి కూడా ఎక్కడా కనబడకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.
ఏపీలో బీజేపీ, జనసేనలు మిత్రపక్షాలన్న విషయం అందరికీ తెలిసిందే. మరి తెలంగాణాలో ? ఇదే ఎవరికీ అర్ధం కావడం లేదు. బీజేపీతో తమకు పొత్తుందని జనసేన నేతలంటారు. కానీ జనసేనతో తమకు ఎలాంటి పొత్తులేదని స్వయంగా తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయే ప్రకటించారు. పొత్తులు లేకపోయినా గ్రేటర్ ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులను పోటీ చేయనీయకుండా బీజేపీ నేతలు విత్ డ్రా చేయించారు.
ఆ తర్వాత జరిగిన ఓ ఎంఎల్సీ ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసిన రామచంద్రరావును కాదని టీఆర్ఎస్ అభ్యర్ధి వాణికి ఓట్లేయమని పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు లేదన్న విషయం బయటపడింది. అయితే ఆ తర్వాత జరిగిన ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేశాయి. అంటే ప్రతి ఎన్నికకు రెండు పార్టీలు ఒక్కోలా వ్యవహరిస్తున్నాయన్న విషయం అర్ధమైపోతోంది. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో జనసేన ను ఎవరు పట్టించుకోలేదు.
మరి తొందరలోనే జరగబోయే హుజూరాబాద్ ఉపఎన్నికలో జనసేన స్టాండ్ ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. బీజేపీకి సహకారం అందిస్తుందా ? లేకపోతే దూరంగా ఉంటుందా అన్న విషయమై రెండు పార్టీల నేతల్లోను అయోమయం పెరిగిపోతోంది. అసలు జనసేన గురించి బీజేపీ నేతలు ఎందుకు ఆలోచిస్తోంది ? ఎందుకంటే బీజేపీ తరపున పోటీ చేయబోయే ఈటల రాజేందర్ గెలుపు అంత ప్రతిష్టాత్మకం కాబట్టే. ఈటలను ఓడించాలని కేసీయార్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి కేసీయార్ ను తీరని దెబ్బకొట్టాలని ఈటల గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.
వీరిద్దరి వ్యవహారం ఇలా ఉంటే మధ్యలో కాంగ్రెస్ నేతలు కూడా పోటీకి రెడీ అయిపోతున్నారు. అంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక అందరికీ ఎంతటి ప్రిస్టేజ్ అయిపోయిందో అర్ధమవుతోంది. ఇలాంటి ఎన్నికలో పది ఓట్లు కూడా చాలా కీలకమే. కాబట్టే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి బీజేపీ నేతలు అంతలా ఆలోచిస్తున్నారు. చివరకు పవన్ ఏమి చేస్తారో చూడాల్సిందే.
This post was last modified on August 15, 2021 11:23 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…