‘సభను మార్కెట్లాగ మార్చేద్దామా’ ? ఇది తాజాగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభ్యులను ఉద్దేశించి సంధించిన ప్రశ్న. గడచిన 12 రోజులుగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలపై పార్లమెంటు దద్దరిల్లిపోతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలకు చెందిన ఎంపిలు ఒకవైపు లోక్ సభలోను అలాగే ఇటు రాజ్యసభలో కూడా పెగాసస్ ఆరోపణలపై విచారణ చేయాలని, ప్రధానమంత్రి సమాధానమివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే వీళ్ళ డిమాండ్ ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ఉభయసభల్లో రచ్చ రచ్చ జరుగుతోంది. శుక్రవారం రాజ్యసభను వాయిదా వేసేసమయంలో సభ్యుల గోలను ఉద్దేశించి ఛైర్మన్ వెంకయ్యనాయుడు పై వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీలేదు. కానీ బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు సభలో ఎలా వ్యవహరించిందనే విషయాన్ని మరచిపోయినట్లుంది.
యూపీఏ-2 ప్రభుత్వంలో 2 జీ స్పెక్ట్రమ్ వేలంపాటలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లో కాగ్ నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా బీజేపీ సభ్యులు ఉభయసభల్లోను గోల మొదలుపెట్టారు. 2జీ స్పెక్ట్రమ్ లో అవినీతి జరగలేదని, కాగ్ నివేదికంతా తప్పులే అని అప్పట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎంత మొత్తుకున్నా బీజేపీ వినిపించుకోలేదు. ఇలాగే సుమారు 20 రోజులపాటు ఉభయసభల్లో గందరగోళం సృష్టించింది. చివరకు సుప్రింకోర్టులో కేసు కూడా వేశారు. ఇదే అంశంలో ప్రభుత్వం అప్పట్లో ఇద్దరు మంత్రులను, ఇద్దరు ఎంపిలపై కేసులు పెట్టి అరెస్టు కూడా చేసింది. చివరకు సుప్రింకోర్టులో జరిగిన విచారణలో స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవినీతే జరగలేదని తేలింది.
అంతకుముందు కూడా రక్షణరంగంలో కుంభకోణం జరిగిందంటు బీజేపీ ఎంపీలు నానా గోలచేశారు. అప్పుడు కూడా దాదాపు 40 రోజుల పాటు ఉభయసభలను సాగనీయలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉంటే పార్లమెంటులో నానా గోల చేస్తుంది. అదే అధికారంలో ఉంటేమాత్రం పార్లమెంటు నిర్వహణపై ప్రతిపక్షాలకు బుద్ధులు చెబుతుంది. దీనికి వెంకయ్య కూడా మినహాయింపుకాదు. ఎందుకంటే దశాబ్దాలుగా రాజ్యసభ ఎంపిగా మాత్రమే కంటిన్యు అవుతున్న వెంకయ్య కూడా రాజ్యసభలో గోల చేసిన వ్యక్తే. మొత్తానికి బీజేపీ చరిత్రను మరచిపోయినట్లే ఉంది చూస్తుంటే.
This post was last modified on July 31, 2021 12:44 pm
భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది నేనే, గుమ్మడికాయ కట్టింది నేనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.…
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్‌పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…