మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు.. గులాబీ గూటికి చేరనున్నారా..? అవుననే సమాధానమే వినపడుతోంది. అందుకే ఆయన ఇప్పుడు సడెన్ గా బీజేపీ ని వీడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా బీజేపీ కి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. ఈ రోజు ఆ పార్టీకి వీడ్కోలు పలికారు.
పార్టీ వీడిన తర్వాత.. ఈటలపై అవినీతిపరుడంటూ విమర్శలు కూడా చేశారు. అయితే.. పార్టీ వీడటానికి ముందే.. మోత్కుపల్లి.. టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు సిగ్నల్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత నేతల మీటింగ్ అటెండ్ అయ్యారు. పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మోత్కుపల్లి ప్రగతి భవన్ కు వెళ్లటంపై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే, దళిత బంధు సమావేశం కన్నా ముందు నుండే మోత్కుపల్లి టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉన్నారన్న వార్తలు వినిపించాయి. తాజాగా మోత్కుపల్లి బీజేపీకి రాజీనామా చేయటంతో ఆయన టీఆర్ఎస్ లో చేరటం లాంఛనమేకానుంది. దళిత బంధు ప్రకటించిన రోజు నుండి… పలువురు దళిత నేతలను పార్టీలోకి చేర్చుకునేలా టీఆర్ఎస్ ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది
Gulte Telugu Telugu Political and Movie News Updates