అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొలి రోజే కౌశిక్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు బల్దియా అధికారులు జరిమానా విధించారు. కౌశిక్ రెడ్డికి జీహెచ్ఎంసీ అధికారులు రూ.10లక్షల జరిమానా విధించారు.
కౌశిక్ రెడ్డి.. ఎలాంటి అనుమతులు లేకుండా.. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు నిర్మించారు. ఈ నేపథ్యంలో.. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో.. అధికారులు జరిమానా విధిస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ ను వీడిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరారు . ఈ నేపథ్యంలో తాను టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బ్యానర్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై నగర ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేశారు. బ్యానర్లు ఫ్లెక్సీలు కట్టవద్దని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా పాడి కౌశిక్ రెడ్డి నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేయడంతో భారీ జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.
నిజానికి పార్టీలో చేరడానికి ముందు రోజే.. కౌశిక్ రెడ్డి ఈ ఫెక్సీలు ఏర్పాటు చేసినా.. పార్టీలో చేరిన తర్వాతే.. ఫైన్ విధించడం గమనార్హం. ఈ ఫ్లెక్సీల విషయమై.. బుధవారం ఉదయం నుంచే విపక్ష నేతలు మీడియాలో.. సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం ఆ తర్వాత.. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత.. వాటిని తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
This post was last modified on July 22, 2021 11:09 am
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…
నిన్న విడుదలైన రణబాలి టీజర్ పట్ల సోషల్ మీడియాలో పాజిటివ్ రియాక్షన్లు ఎక్కువగా కనిపించాయి. అలాని అందరూ యునానిమస్ గా…