ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో మరోసారి హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా… ఈ విషయంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. తన ఫోన్ కూడా హ్యాకింగ్ కి గురైందంటూ బాంబు పేల్చాడు.
ఇప్పటికి తన ఫోన్ ఐదు సార్లు హ్యాకింగ్ కి గురైందని.. తాను ఐదు సార్లు ఫోన్ మార్చాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నిసార్లు ఫోన్ మార్చినా.. హ్యాకింగ్ దాడి జరుగుతూనే ఉందని ఆయన చెప్పడం గమనార్హం.
ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. ఈ నెల 14న ఆయన ఫోన్ హ్యాకింగ్ కి గురైంది. అయితే.. తాజాగా.. ఇజ్రాయిల్ నుంచి ఇండియా పొందిన ‘స్పైవేర్ పెగాసన్’ ద్వారా దేశవ్యాప్తంగా పలువురి ఫోన్లు హ్యాక్ అయినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ ప్రచురించింది.
అందులో కేంద్ర మంత్రుల నుంచి భద్రతా దళాల చీఫ్ ఆఫీసర్లు, కీలక ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, బడా వ్యాపారులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా… అందులో తన ప్రమేయం ఏమీ లేదని ఆ వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.