ఎలాగైనా తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ నాయకత్వం పట్టు. ఇదే సమయంలో తనపై అనర్హత వేటు పడకుండా తప్పించుకోవాలని తిరుగుబాటు ఎంపి ప్రయత్నాలు. రెండువైపుల ఒకేసారి జరుగుతున్న ప్రయత్నాలకు తొందరలోనే ముగింపు పడే అవకాశం ఉందని అనిపిస్తోంది. రెండు వైపుల నుండి జరుగుతున్న పరిణామాలు కూడా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై బాగా ఒత్తిడిని పెంచేస్తోంది.
తాజాగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అనర్హత వేటు విషయంలో రాబోయే సమావేశాల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అర్ధమైపోతోంది. అనర్హత వేటు విషయంలో తాను నిబంధనలను ప్రకారమే నడుచుకుంటానని స్పష్టంచేశారు. రెండు పార్టీలతోను భేటీ అయి వాళ్ళ వాదనలు వింటానని స్పీకర్ చెప్పటం చూస్తుంటే ఆ భేటీ ఏదో తొందరలోనే జరిగేట్లే ఉంది.
నిజానికి ఓ సభ్యుడిపై అనర్హత వేటు అన్నది విప్ జారీని ఉల్లంఘించినపుడు మాత్రమే తీసుకుంటారా ? లేకపోతే పార్టీ నియమావళిని ఉల్లంఘించినపుడు కూడా అనర్హత వేటు వేయచ్చా ? అనేది అయోమయంగా మారింది. తిరుగుబాటు ఎంపి విప్ ఉల్లంఘించినట్లు ఎక్కడా కనబడటంలేదు.
అయితే పార్టీ నియమావళిని ఉల్లంఘించారనేందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఈ పాయింట్ లోనే పార్టీ నాయకత్వం రఘురామపై అనర్హత వేటుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. అనర్హత వేటు విషయంలో వైసీపీకి ఉన్న తొందర స్పీకర్ కు ఎందుకుంటుంది ? అందుకనే ఏదో కారణం చెప్పి విషయాన్ని స్పీకర్ బాగా సా…..గదీస్తున్నారు. అందుకనే వైసీపీ కూడా ఒత్తిడి పెంచేసింది. అందుకనే ఇఫుడు పిటీషన్ వ్యవహారం క్లైమ్యాక్సికి చేరుకున్నట్లే అనిపిస్తోంది.
రఘురామరాజుపై వేటు వేయడం లేదన్న ఒత్తిడిలో ఇటీవలే విజయసాయిరెడ్డి ఏకంగా స్పీకర్ పై విమర్శలు చేశారు. గతంలో పొరపాటున రాజ్యసభలో నోరు జారి తరువాత నాలిక్కరుచుకుని సారీ చెప్పి విజయసాయి విమర్శలు ఆశ్చర్యకరం. దీనిపై తాజాగా రఘురామరాజు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చి సంచలనం సృస్టించారు. చూడాలి ఏం జరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates