ఏపీలో స్పీడు తగ్గింది, తెలంగాణలో పెరిగింది

గత 24 గంటల్లో కరోనా వేగం కొంతవరకు తగ్గినా కేసుల పెరుగుదల మాత్రం నమోదైంది. అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో తక్కువ కేసులు నమోదయ్యాయి. ఏపీలో గత 24 గంటల్లో 11 కేసులు నమోదు అయ్యాయి.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 314 కి పెరిగింది. గుంటూరులో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. కడప, నెల్లూరులో ఒక్కో కేసు నమోదైంది. నిన్న రాత్రి 10 గంటల తర్వాత ఒక్క కేసు నమోదైంది. మునుపటి రోజులతో పోలిస్తే కేసులు తక్కువ నమోదైనా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎంత మందికి టెస్టులు చేస్తున్నదీ వివరాలు సరిగా వెల్లడించకపోవడంతో ఏపీలో ఏం జరుగుతుందో తెలియడం లేదు.

ఇక తెలంగాణలో ఒక్క రోజులో 40 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 404 కి పెరిగింది. ఈరోజుతో కలిపి మొత్తం 45 మంది డిశ్చార్జి అయ్యారు. 11 మంది చనిపోయారు. 348 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదృష్టవశాత్తూ ప్రస్తుతానికి తెలంగాణ రెండో దశలోనే ఉంది. ఇదిలా ఉండగా… గచ్చిబౌలిలో కరోనా కోసం భారీ ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారు. అందులో 1500 బెడ్లు ఏర్పాటుచేశారు.

ఇండియా మొత్తం మీద 508 కొత్త కేసులు నమోదు కాగా… మహారాష్ట్రలో ఎక్కువ కేసులు కనిపించాయి. కోలుకున్న వారు, మరణించి వారు మినహాయిస్తే 4312 కేసులు ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ గా ఉన్నాయి. కొన్ని చోట్ల మూడో దశలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.