రాజకీయాల్లోకి రానన్న హిమాన్షు.. నెటిజన్ల ట్రోల్స్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు తాను రాజకీయాల్లోకి రానంటూ స్పష్టం చేశాడు. ఈ మేరకు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. కాగా… హిమాన్ష్ చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. తాను రాజ‌కీయాల్లోకి రాన‌ని.. జీవితంపై త‌న‌కు ఎన్నో క‌ల‌లు ఉన్నాయ‌ని.. ఎన్నింటినో సాధించాల్సి ఉంద‌ని హిమాన్ష్ చెప్పాడు. కాగా.. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.

అస‌లు రాజ‌కీయ ప్ర‌వేశం గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందని కొంద‌రు ప్ర‌శ్నిస్తే.. ఈ ఒక్క ట్వీట్‌తో ఆల్‌రెడీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశావు.. రాజ‌కీయ నేత‌లు ఇలాగే చెప్తుంటారు అని మ‌రికొంద‌రు రిప్లై ఇచ్చారు. ఇక కేసీఆర్ కూడా గ‌తంలో ఇలాగే మాట్లాడార‌ని.. త‌న కొడుకు అమెరికాలో ఉన్నాడ‌ని, రాజ‌కీయాల్లోకి అస‌లు రాబోడ‌ని చెప్పి.. ఇప్పుడు త‌మ నెత్తిన పెట్టిన విష‌యం గుర్తుంద‌ని కొంద‌రు సెటైర్లు వేస్తున్నారు.

ఇక హిమాన్షు అప్పుడే తొంద‌ర‌ప‌డ‌కు.. మీ తాత నీకోసం ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గాన్ని ఇప్ప‌టికే సెలెక్ట్ చేసి ఉంటాడ‌ని.. త్వ‌ర‌లోనే నువ్వు కూడా ఎమ్మెల్యే అవుతావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. హిమాన్షు చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.