కేంద్రాన్ని వెంటాడుతున్న సుప్రీంకోర్టు

నష్టపరిహారం విషయంలో కేంద్రప్రభుత్వానికి సుప్రింకోర్టుకు మధ్య వివాదం పెరిగిపోతోంది. కోవిడ్ వైరస్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించే విషయంలో రెండింటి మధ్య వివాదం మొదలైంది. ఇతర జాతీయ విపత్తుల్లో ఇచ్చినట్లుగా కోవిడ్ మృతులకు నష్ట పరిహారం చెల్లించటం సాధ్యం కాదని గతంలోనే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అయితే అలా చెప్పటాన్ని తప్పుపట్టిన సుప్రింకోర్టు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

ఇంతకీ విషయం ఏమిటంటే కోవిడ్ మృతులకు రు. 4 లక్షలు నష్టపరిహారం చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఓ ప్రాజహిత వ్యాజ్యం సుప్రింకోర్టులో దాఖలైంది. ఈ సందర్భంగా జరిగిన విచారణలో తుపాను, వరదల వల్ల మృతి చెందిన వారికి ఇచ్చినట్లుగా కోవిడ్ మృతులకు నష్టపరిహారం ఇవ్వటం సాధ్యంకాదని కేంద్రం చెప్పింది. ఒకవైపు లక్షల మంది కరోనా వైరస్ తో చనిపోతుంటే ఎంత మందికని నష్టపరిహారం ఇవ్వాలని కేంద్రం పాయింట్ లేవనెత్తింది.

కరోనా మృతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటే నిధులు సరిపోదని కూడా చెప్పింది. అయితే సుప్రింకోర్టు ఇదే విషయమై మాట్లాడుతు నష్టపరిహారం ఇవ్వదని చేతులు దులుపుకుంటే కుదరని కచ్చితంగా చెప్పేసింది. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందే అని తేల్చిచెప్పింది.

అయితే నష్టపరిహారం ఎంతివ్వాలనే విషయాన్ని కేంద్రమే నిర్ణయించాలన్నారు. ఈ విషయంలో సుప్రింకోర్టు జోక్యం చేసుకోదని కూడా చెప్పింది. నష్ట పరిహారాన్ని నిర్ణయించే విషయంలో కేంద్రానికి 6 వారాల గడువు ఇచ్చింది. మరి సుప్రింకోర్టు తాజా ఉత్తర్వుల ప్రకారం కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.