Political News

ఇది మీ హక్కు.. రూ.130కే 200 చానళ్లు

కేబుల్ బిల్లుకు చెక్ పెట్టేలా.. చెల్లించే ప్రతి పైసాకు తగిన న్యాయం కలిగేలా ట్రాయ్ (భారత టెలికం నియంత్రణ సంస్థ) 2020 జనవరి ఒకటిన విడుదల చేసిన కొత్త టారిఫ్ ను బాంబే హైకోర్టు ఓకే చేసింది. కొత్త టారిఫ్ విధానంతో ఇంతకాలం బొకేలా పేరుతో బాదేస్తున్న చానళ్లకు షాకిచ్చింది. కొత్త నిబంధన ప్రకారం ఇప్పటివరకు రూ.130 చెల్లిస్తే 100 చానళ్లు ఉచితంగా చేసే వీలుండేది. ఆ వందలోనూ 36 డీడీ చానళ్లు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనను మార్చి రూ.130కే 200 ఉచిత చానళ్లను ఎంపిక చేసుకోవటం మాత్రమే కాదు.. డీడీకి చెందిన 36 చానళ్లను అదనంగా తీసుకునే వెసులుబాటు కల్పించారు. అంటే.. మొత్తంగా 236 చానళ్లు ఇవ్వాల్సిందే.

అదే సమయంలో వినియోగదారుడు రూ.160 చెల్లిస్తే.. సర్వీస్ ప్రొవైడర్లు తమ వద్ద ఉన్న మొత్తం ఉచిత చానళ్లను ఇవ్వాల్సి ఉంటుంది. బొకేలా మాయా జాలానికి చెక్ పెట్టేలా బాంబే హైకోర్టు తాజా తీర్పు ఉండటం గమనార్హం. ట్రాయ్ కొత్త నిబంధనల్ని సవాల్ చేస్తూ వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా పెద్ద పెద్ద చానళ్లు కోర్టును ఆశ్రయించాయి. అందులో సోనీ.. జీ లాంటి సంస్థలు ఉన్నాయి.

వీరు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన జస్టిస్ అంజాద్ సయ్యద్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ట్రాయ్ రూపొందించిన నిబంధనలు సరిగా ఉన్నాయని పేర్కొంది. పిటిషన్ దారులు పేర్కొన్నట్లుగా నిరంకుశంగా.. అహేతుకంగా లేవని తేల్చింది. అంతేకాదు.. ఒక భాషకు చెందిన చానళ్లు ఒకే వరుసలో ఉండాలని.. ఎమ్మెస్వోలు చానళ్లను తమకు తోచినట్లుగా.. ఆ మాటకు వస్తే ఇష్టం వచ్చినట్లుగా మార్చకూడదని తేల్చింది.

ఒకవేళ చానళ్లను నంబరును మార్చాలంటే ముందుగా ట్రాయ్ అనుమతి తీసుకోవాల్సిందేనన్న కొత్త నిబందన సరైనదేనని తేల్చింది. కాకుంటే.. పిటిషన్ దారుల అభ్యర్థన మేరకు కొత్త నిబంధన అమలును మరో ఆరువారాల పాటు పొడిగించారు. కొత్త నిబంధనల్లో కీలకమైనవి.

  • బొకే సిస్టంలో కీలక మార్పులు. ఒక బొకేలో 10 చానళ్లు ఉండి.. ఆ చానళ్ల టోకు ధర రూ.30 అనుకుంటే.. సగటున ఒక్కో చానల్ ధర రూ.3 ఉన్నట్లు. అయితే.. ఇప్పటివరకు తమకు తోచినట్లుగా పాపులర్ చానల్ ధర ఉండేది. దీంతో.. మిగిలిన అన్ని చానళ్లు తీసుకోవాల్సి వచ్చేది. అలాంటి తీరుకు చెక్ పెట్టి.. ఒక చానల్ ధర మూడు రెట్లకు మించి ఉండకూదు. అంటే.. రూ.9కి మించి ఉండొద్దన్న ట్రాయ్ నిబంధనను కొట్టేసింది.
  • బొకేలో ఉండే పే చానళ్లకు సంబంధించి ఒక చానల్ కు గరిష్ఠ ధర రూ.19లుగా ఉండేది. ఇప్పుడు అది కాస్తా రూ.12 తగ్గించారు. అంటే బొకేలో ఉండే ఏ చానల్ ధర రూ.12కు మించి ఉండకూడదు.
  • ఒకే ఇంట్లో రెండు కేబుల్ కనెక్షన్లు ఉంటే.. రెండో కనెక్షన్ కు నెట్ వర్క్.. క్యారేజ్ ఫీజులో 40 శాతం మాత్రమే వసూలు చేయాలి. దీంతో.. ఇంట్లో రెండు టీవీలు ఉన్న వారికి భారం తగ్గనుంది.

This post was last modified on July 1, 2021 11:40 am

Share

Recent Posts

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

2 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

9 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

9 hours ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

10 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

12 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

12 hours ago