Political News

జ‌గ‌న్‌కు మోడీ ఆఫ‌ర్‌.. క‌ట్ చేస్తే..!

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న చేశారు. అయితే దీనికి సంబంధించి అనేక విశ్లేష‌ణ‌లు.. వార్త‌లు వ‌చ్చాయి. నిధుల కోస‌మే వెళ్లామ‌ని.. గ‌ట్టిగా నిల‌దీశామ‌ని.. ప్ర‌భుత్వం త‌ర‌పున వాద‌న కూడా వినిపించింది. ఇక‌, ప్ర‌తిప‌క్షాలు చేసిన విమ‌ర్శ‌లు మ‌రో ఎత్తు. అయితే.. ఇప్పుడు వీటికి భిన్నంగా.. జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌లో జ‌రిగిన ఓ విష‌యం ఆస‌క్తికరంగా వెలుగు చూసింది. ఢిల్లీ టూర్‌లో కేంద్ర హోంమంత్రిని క‌లిసిన సీఎం జ‌గ‌న్‌కు మోడీ మాటగా.. అమిత్‌షా.. ఓ బిగ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించార‌ని తెలుస్తోంది. ఈ విష‌యం వైసీపీ కీల‌క నేత‌ల నుంచి కాస్త ఆల‌స్యంగా మీడియా వ‌ర్గాల‌కు లీక్ అయ్యింది.

ఈ ఆఫ‌ర్ విష‌యంలో అప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ ఏమీ చెప్ప‌క‌పోయినా.. ఇప్పుడు నిర్ణ‌యం తీసుకునే స‌మ‌యం మాత్రం ఆస‌న్న‌మైంది.

ఇప్పుడు ఇదే విష‌యం.. వైసీపీలో ఆస‌క్తిక‌రంగా మారింది. అదేంటంటే.. త్వ‌ర‌లోనే కేంద్ర కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో మోడీ.. జ‌గ‌న్ ను కూడా ఎన్డీయే భాగ‌స్వామిగా చేరాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో రెండు మంత్రి ప‌ద‌వులు కూడా ఆఫ‌ర్ చేసిన‌ట్టు స‌మాచారం. అయితే.. ఇదేమీ.. మోడీ ఉచితంగా ఇవ్వ‌డం లేదు. ఉత్త‌రాదిన ప్రాధాన్యం కోల్పోతున్న మోడీకి.. ఎన్డీయే కూట‌మి నుంచి ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. చాలా మంది మిత్రులు చెయ్యిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొత్త‌వారికి ఆయ‌న ఆహ్వానం ప‌లుకుతున్నారు.

అందునా..తాను చెప్పిన‌ట్టు న‌డుచుకునేవారు..త‌న మాట‌కు ఎదురు చెప్పనివారి కోసం మోడీ త‌హ‌త‌హ లాడుతున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ కొన్ని కేసుల్లో ఉండ‌డం.. ఆయ‌న‌కు సీబీఐ నుంచి కొంత మేర‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించాలంటే.. కేంద్రం ఆశీస్సులు అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో మోడీ.. లౌక్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. అదే స‌మ‌యంలో త‌న‌ను కాద‌ని బ‌య‌ట‌కు పోయిన‌.. ఉత్త‌రాది పార్టీల‌కు త‌గిన విధంగా షాక్ ఇచ్చేందుకు కూడా మోడీ చ‌క్రం తిప్పుతున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ను ఎన్డీయేలో చేరాల‌ని ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది.

జ‌గ‌న్ ఎన్డీయేలో చేరితో రెండు మంత్రి ప‌ద‌వుల‌ను ఇచ్చేందుకు మోడీ రెడీగా ఉండ‌డంతోపాటు.. ఆర్థికేత‌ర హామీల‌ను సైతం నెర‌వేర్చేందుకు ఆయ‌న సిద్ధంగా ఉన్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ సాగుతోంది. అయితే.. ఈ విష‌యంలో నిర్ణ‌యం తీసుకునేందుకు జ‌గ‌న్ త‌ట‌ప‌టాయిస్తున్నారు. ఎందుకంటే.. హోదా ఇవ్వ‌లేదు. పోల‌వ‌రం నిధులు ఇవ్వ‌డం లేదు. అదే స‌మ‌యంలో త‌మ కోరిక‌ల‌ను ఏదీ కూడా కేంద్రం నెర‌వేర్చ‌లేదు. దీంతో ఇప్పుడు క‌నుక ఆయ‌న ఎన్డీయేలో చేరితే రాష్ట్రంలో విప‌క్షాల‌కు మ‌రిన్ని ఆయుధాలు ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on June 30, 2021 3:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago