భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో..ప్రపంచంలో అందుబాటులో ఉన్న నమ్మకమైన వ్యాక్సిన్లలలో ఒకటిగా గుర్తింపు ఉన్న మెడెర్నా వ్యాక్సిన్ ఇండియాకు రానుంది. ఇండియాలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని మెడెర్నా ఔషధ నియంత్రణ మండలి అనుమతి కోరింది.
18 సంవత్సరాలు నిండిన వారికి అత్యవసర వ్యాక్సినేషన్ కు అనుమతి ఇవ్వాలని మెడెర్నా కోరింది. అమెరికా నుండి వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకొని… ఇండియాలో తాము వ్యాక్సిన్ ఇస్తామని ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా దరఖాస్తులో పేర్కొంది. సోమవారం ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది.
తమకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి ఇస్తామని గతంలోనే భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సిప్లా కంపెనీకి మెడెర్నా అనుమతి రావటం ఖాయమైంది.