Political News

రేవంత్‌పై రాజ‌కీయం మంట‌లు.. టీక‌ప్పులో తుఫానేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మాట మంట‌లు రేగుతున్నాయి. భీష‌ణ ప్ర‌తిజ్ఞ‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి! మ‌రి ఇవ‌న్నీ.. మున్ముందు కూడా కొన‌సాగుతాయా? లేక‌.. టీక‌ప్పులో తుఫాను మాదిరిగా స‌మ‌సిపోతాయా? ఇదీ.. ఇప్పుడు.. ప్ర‌ధాన ప్ర‌శ్న‌. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షుడిగా.. నూత‌నంగా నియ‌మితులైన‌.. రేవంత్ రెడ్డి కేంద్రంగా కాంగ్రెస్ సీనియ‌ర్లు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. పైకి ఏమీ అన‌క‌పోయినా.. లోలోన మ‌థ‌న‌ ప‌డుతున్న‌వారు.. పైకి వెళ్ల‌గ‌క్కుతున్న‌వారు.. ఇలా సీనియ‌ర్లు.. త‌మ క‌డుపులో ఆవేద‌న‌ను బ‌య‌ట‌కు వెళ్ల‌గ‌క్కుతున్నారు.

కేవ‌లం 2018లో కాంగ్రెస్‌లోకి వ‌చ్చిన రేవంత్‌రెడ్డికి.. కొన్ని ద‌శాబ్దాలుగా పార్టీలో పాతుకుపోయిన త‌మ‌కు తేడాను గుర్తించ‌డంలో పార్టీ అధిష్టానం విఫ‌ల‌మైంద‌ని.. సీనియ‌ర్ నాయ‌కుడు జ‌గ్గారెడ్డి బ‌య‌ట‌ప‌డిపోయారు. ఇక‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మ‌రింత దూకుడుతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై గాంధీ భవన్ మెట్లెక్కనని, టీడీపీ నుంచి వచ్చిన నేతలు తనను కలవద్దని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అది టీపీసీసీ కాదని, టీడీపీ పీసీసీగా మారిందని నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీ ఎన్నిక జరిగిందని విమర్శించారు. మ‌రోనేత‌.. వీహెచ్‌.. రేవంత్ ఎంప‌క‌కు ముందుగానే.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ఆయ‌న‌కు ఏం తెలుసున‌ని.. పార్టీ ప‌గ్గాలు ఇస్తారు. ఇలా అయితే.. నే కాంగ్రెస్‌లో ఉండ‌-అని వ్యాఖ్యానించిన హ‌నుమంత‌న్న‌.. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియ‌క మౌనంగా ఉన్నారో.. లేక మ‌రేం చేస్తారో తెలియ‌దు. అదేవిధంగా భ‌ట్టి విక్ర‌మార్క‌, గీతారెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, డీ. శ్రీధ‌ర్‌బాబు.. ఇలా అనేక మంది నాయ‌కులు.. పీక‌ల‌దాకా కోపంతో ఉన్నారు. క‌ట్ చేస్తే.. వీరంతా ఏం చేస్తారు? పార్టీని వ‌దిలేస్తారా? పొరుగు పార్టీల‌తో జ‌త‌క‌డ‌తారా? అంటే.. ఎట్టి ప‌రిస్థితిలో ఇలాంటి చ‌ర్య‌ల‌కు ఒడిగ‌ట్టేది లేద‌ని స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఎందుకంటే.. కొన్ని ద‌శాబ్దాలుగా కాంగ్రెస్‌తో ముడిప‌డి ఉన్న రాజ‌కీయాలు ఒక రీజ‌న్ అయితే.. ఇత‌ర పార్టీల్లోనూ స‌రైన ప‌ద‌వులు క‌నిపించ‌డం లేదు. వెళ్తే.. బీజేపీలోకి వెళ్లాలి.. అనే మాట వినిపిస్తున్నా… ఆ సాహ‌సం ఈ నేత‌లు చేసే ప‌రిస్థితి క‌నిపించ‌దు. పైకి విమ‌ర్శ‌లు.. విసుర్లు.. క‌నిపిస్తున్న నేప‌థ్యంలో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు.. అధిష్టానం.. నుంచి దూత వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. తెలంగాణ‌లోని సీనియ‌ర్ల‌ను స‌ర్దుబాటు చేసేందుకు, రేవంత్‌తో క‌లిసి ముందుకు సాగేలా చేసేందుకు అధిష్టానం త్వ‌ర‌లోనే ఓ సీనియ‌ర్‌ను దూత‌గా పంప‌నున్న‌ట్టు.. ఢిల్లీలో తెలంగాణ రాజ‌కీయాలపై అవ‌గాహ‌న ఉన్న కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. సో.. ఇప్పుడు నెల‌కొన్న ప‌రిస్థితులు… టీ క‌ప్పులో తుఫానేన‌ని అంటున్నారు.

This post was last modified on June 28, 2021 7:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

YD రాజు కాదు… వెంకీ అంటే ఫ్యామిలీ రాజు !

ఇవాళ విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ కి ట్రేడ్ నివ్వెరపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టడం చూసి…

1 hour ago

భారతీయుడు 3 భవిష్యత్తు ఏంటి?

థియేటరా ఓటిటినా అనేది పక్కనపెడితే భారతీయుడు 3 బయటికి రావడమైతే పక్కానే. కానీ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయితే…

1 hour ago

పెంచలయ్య మహా ముదురు… ఇన్ని సార్లా?

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి పరకామణిలో వంద గ్రాముల బంగారు బిస్కెట్ దొంగలిస్తూ దొరికిపోయిన పెంచలయ్య వ్యవహారంలో షాకింగ్ నిజాలు…

4 hours ago

స్టార్ బక్స్… దిగి రాక తప్పలేదా?

స్టార్ బక్స్... ఈ పేరు వింటేనే కుర్రకారుకి ఓ రేంజ్ ఉత్సాహం వస్తుంది. ఎప్పుడెప్పుడు అందులోకి ప్రవేశిద్దామా అంటూ కుర్రాళ్ళు…

4 hours ago

ప‌వ‌న్ పార్ట్‌టైం కాదు.. ఫుల్ టైం లీడర్!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై గ‌తంలో వైసీపీ నాయ‌కులు చేసిన ఆరోప‌ణ‌లు ప‌టాపంచ‌లు అవుతున్నాయి. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ…

4 hours ago

ఫ్యాన్ వార్ చేసే అభిమానులకు అజిత్ చురకలు

సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగాక అభిమానుల్లో హీరోయిజం పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఒకప్పుడు రిలీజ్ రోజు హడావిడితో…

5 hours ago