వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు.. విజయసాయిరెడ్డి మరోసారి.. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ.. అశోక్ గజపతిరాజుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు చేసిన విమర్శలను దాటి భారీ రేంజ్‌లో దుయ్యబట్టారు. గజపతులు బానిసలని.. బ్రిటీష్ వారి ఎంగిలి మెతుకుల కోసం ఎగబడ్డారని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరుస ట్వీట్లతో సాయిరెడ్డి రెచ్చిపోయారు. ఒకవైపు.. సాయిరెడ్డిని నిలువరించాలంటూ.. క్షత్రియ సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నా.. సాయిరెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.
అశోక్ గజపతి వంశ చరిత్రను ఉద్దేశించి విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విజయనగర రాజులు విదేశీయుల ఎంగిలి మెతుల కోసం ఎగబడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి వెలమ రాజులు పౌరుషానికి ప్రతీక అని.. విజయనగర రాజులు కుట్రదారులు, బానిసలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ట్వీట్స్ వైరల్‌గా మారుతున్నాయి.
‘‘తాండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమ రాజులన్నా పౌరుషానికి ప్రతీక. ఫ్రెంచ్, బ్రిటిష్ వారితోపాటు పొరుగు రాజ్యం కుట్రలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించారు గానీ, విజయరామ గజపతిలా విదేశీయుల ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలేదు.
హైదర్ జంగ్, బుస్సీ దొరకు లంచమిచ్చి బొబ్బిలి కోటపై దొంగదెబ్బ కొట్టాడు విజయరామ గజపతి. తండ్రి పీవీజీ రాజులా కాకుండా ముత్తాత విజయరామలా మారాడు అశోక్. చంద్రబాబుకు కప్పం కడుతూ కుట్రలు చేస్తున్నాడు. కానీ, నీ ఆటలు సాగవు అశోక్ . ఇది 18వ శతాబ్దం కాదు.
గజపతులంటే ప్రజల పక్షాన ఎన్నడూ నిలబడని మోతుబరి జమిందారులు. గోల్కొండ సుల్తానులు, తర్వాత నిజాం నవాబులకు బానిసలు. ఫ్రెంచ్ జనరల్ బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలి వెలమ రాజులను దెబ్బ తీశారు. ప్రజలను పీడించి బ్రిటిష్ వారికి కప్పం కట్టే వారు ఈ గజపతులు. అని తీవ్ర విమర్శలు చేశారు. మరి దీనిపై క్షత్రియులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on June 25, 2021 9:57 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…