ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలకు భిన్నంగా మీకు కరోనా ఉందా? లేదా? అని తేల్చటానికి సరికొత్త విధానం తెర మీదకు వచచింది. ఒక వ్యక్తికి కరోనా సోకిందా? లేదా? అన్న దానిని అతనికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే తేల్చొచ్చని.. అందుకు అతడు వాడే స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చెప్పేస్తుందని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ స్క్రీన్ నుంచి సేకరించిన నమూనాల సాయంతో కొవిడ్ ఉందా? లేదా. అని తేల్చేయొచ్చని చెబుతున్నారు. తాజా విధానాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు.
శరీరంలోకి ఎలాంటి సాధనాన్ని జొప్పించకుండానే.. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద ఉండే వైరస్ ను గుర్తించటం ద్వారా కొత్త విధానం పని చేస్తుంది. ఈ కొత్త విధానాన్ని చిలీకి చెందిన స్టార్టప్ ‘డయాగ్నోసిస్ బయోటెక్’ సంస్థ దీనికి సంబంధించిన యంత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో.. కరోనా ఉందా? లేదా? అన్నది కచ్ఛితంగా తేల్చవచ్చని చెబుతున్నారు. ఈ కొత్తవిధానానికి ‘పోస్ట్’ (ఫోన్ స్క్రీన్ టెస్టింగ్) అన్న పేరు పెట్టారు.
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న విధానం ఖర్చుతో పాటు.. కొంత నొప్పి కలిగించేదిగా చెప్పాలి.స్వాబ్ టెస్టు కోసం ఒక పుల్లను ముక్కు లోపలి భాగంలోనూ.. గొంతు లోపల పెట్టి నమూనాను సేకరించాల్సిన అవసరం లేదు. కొవిడ్ అనుమానితుల నుంచి నమూనాను వారి మొబైల్ స్క్రీన్ నుంచి సేకరించొచ్చు. ఈ కొత్త విధానాన్ని తాజాగా పరీక్షించారు. అనుమానితుల స్మార్ట్ ఫోన్ల నుంచి నమూనాను సేకరించి పరీక్షించారు. ఇందులోపాజిటివ్ గా తేలిన వారంతా తర్వాత నిర్వహించిన టెస్టుల్లో కొవిడ్ బారిన పడినట్లుగా తేల్చారు. ఈ కొత్త విధానం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
This post was last modified on June 25, 2021 12:15 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…