తెలంగాణలో ఎయిర్ పోర్టు అంటే శంషాబాద్ ఎయిర్ పోర్టు మాత్రమే. కొందరికి మాత్రమే అందుబాటులో ఉండే బేగంపేట ఎయిర్ పోర్టు మినహా మరెక్కడా లేవు. పక్కనే ఉన్న ఏపీలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పలు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. తిరుపతి.. కడప.. కర్నూలు.. విజయవాడ.. రాజమండ్రి.. కాకినాడ.. విశాఖపట్నంలో ఎయిర్ పోర్టులు ఉన్నాయి. అందుకు భిన్నంగా తెలంగాణలో హైదరాబాద్ మినహా మరెక్కడా ఎయిర్ పోర్టులు లేవు.
ఈ కొరతను తీర్చేందుకు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుల్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. తొలుత దేశీయ అవసరాలు తీర్చేలా.. కాలక్రమంలో అంతర్జాతీయ సర్వీసులు తిరిగేందుకు వీలుగా ఎయిర్ పోర్టులను నిర్మించాలని భావిస్తున్నారు. టైర్ టూ సిటీస్ లో కొత్త ఎయిర్ పోర్టుల్ని నిర్మించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా పలు విభాగాలు వాటిని పరిశీలించి సానుకూల నివేదికలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. చిన్నపట్టణాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్న ఈ విమానాశ్రయాలకు భూసేకరణ.. విమానాశ్రయాల నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్నదిగా చెబుతున్నారు. అందుకే..ఖర్చు భారాన్ని తగ్గించుకోవటానికి ఫేస్ 1.. ఫేజ్ 2 పేరుతో ఎయిర్ పోర్టుల్ని నిర్మించనున్నారు.
ఫేజ్ 1లో చిన్న విమానాల రాకపోకలకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు. ఫేజ్ 2లో భాగంగా విమానాశ్రాయాన్ని మరింత విస్తరించి.. పెద్ద విమానాల రాకపోకలకు ఏర్పాట్లు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే.. వరంగల్ లో మాత్రం ఫేజ్ 2 ప్రకారం విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే.. ఆ నగరం వేగంగా డెవలప్ అవుతున్న నేపథ్యంలో.. ఒకేసారి భారీ ఎత్తున ఎయిర్ పోర్టును నిర్మించాలని భావిస్తున్నారు.
ఇప్పటికి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఒక విమానాశ్రయానికి మరో విమానాశ్రయానికి మధ్య దూరం 150కి.మీ. ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటే ఎయిర్ పోర్టు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వరు. ఈ కారణంతో మహబూబ్ నగర్ లో ఎయిర్ పోర్టు విషయంలో అభ్యంతరాలు వచ్చే వీలుందని చెబుతున్నారు. అయితే..శంషాబాద్ ఎయిర్ పోర్టును నిర్వహించే జీఎంఆర్ తో చర్చలు జరిపి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో నిర్మించాలని భావిస్తున్న ఎయిర్ పోర్టుకు మార్గం సుగమం చేయాలనుకుంటున్నారు.
భవిష్యత్తులో తెలంగాణలో ఏర్పాటు చేసే విమానాశ్రయాలు ఎక్కడంటే
This post was last modified on June 24, 2021 4:12 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…