కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో 15 లక్షలకుపైగా చనిపోయారా ? అవుననే అంటున్నారు ఐఐఎం అహ్మదాబాద్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ చిన్మయ్ తుంబె. ఏ రాష్ట్రం కూడా కరోనా రోగులను, మరణాల అసలు సంఖ్యను బయటపెట్టడం లేదని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రోగులు, మరణాలపై తమ బృందం దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వాలు చెబుతున్న అధికారిక లెక్కల కన్నా కనీసం 15 లక్షలమంది ఎక్కువగా చనిపోయుంటారని చిన్మయ్ బల్లగుద్దకుండానే చెప్పారు.
కరోనా వైరస్ తీవ్రత మొదటి వేవ్ కన్నా సెకెండ్ వేవ్ లోనే చాలా ఎక్కువగా ఉందని ప్రొఫెసర్ చెప్పారు. చిన్మయ్ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మద్యప్రదేశ్ లో అధికారికంగా 37,379 మంది చనిపోయారట. అయితే గతంతో పోలిస్తే ఉండాల్సిన మరణాల సగటుకన్నా అధికంగా నమోదైన మరణాల సంఖ్య 5.29 లక్షలున్నట్లు చెప్పారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో చనిపోయిన వారిలో ఇళ్ళల్లో చికిత్సలు చేయించుకుని మరణించిన వారి సంఖ్య కూడా భారీగానే ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి మరణాలు కరోనా లెక్కల్లో కనిపించటం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి మరణాలు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉన్నట్లు ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.
నిజానికి చిన్మయ్ చెప్పారు కానీ ఏ ప్రభుత్వం రోగులు, మరణాల వాస్తవ సంఖ్యను ఉన్నదున్నట్లుగా చెప్పదు. ప్రపంచంలో ఏ దేశం తీసుకున్న మరణాల సంఖ్యను తగ్గించే చూపుతుంది. నష్టపరిహారం, సౌకర్యాలు తదితరాలను పక్కన పెట్టేసినా మిగిలిన జనాల్లో భయాందోళనలు పెరిగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా ఇదే పద్దతిని అనుసరిస్తారనటంలో సందేహంలేదు. కాబట్టే అధికారిక లెక్కలకు-వాస్తవానికి తేడా ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates