క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కొద్దిరోజులుగా కేంద్ర్రప్రభుత్వానికి, సోషల్ మీడియా నెట్ వర్క్ యాజమాన్యాలకు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. భారత్ లో నిర్వహించే ఏ సోషల్ నెట్ వర్కయినా దేశ చట్టాలకు లోబడే పనిచేయాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. చాలా యాజమాన్యాలు మనదేశ చట్టాలను అంగీకరించాయి. అయితే ట్విట్టర్ మాత్రం అంతిమంగా తమ విధానాలే తమకు ముఖ్యమని వాదిస్తోంది.
ఇదే విషయమై కాంగ్రెస్ ఎంపి శశిధరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్ధాయిసంఘంతో ట్విట్టర్ ప్రతినిధులు సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన భేటీలో ట్విట్టర్ ప్రతినిధులు తమ వాదనకే కట్టుబడున్నట్లు సమాచారం. ఒకవైపు భారతీయ చట్టాలను తాము గౌరవిస్తామని చెబుతునే మరోవైపు అంతిమంగా తమ విదానాలే తమకు ముఖ్యమని కూడా చెప్పటమే విచిత్రంగా ఉంది.
ట్విట్టర్ ప్రతినిధుల సమాధానాలను విశ్లేషించిన సంఘంలోని ఎంపిలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. భారత్ చట్టాలంటే ట్వట్టర్ ప్రతినిధులు లెక్కలేనట్లుగా వ్యవహరిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. భారత్ లో ట్విట్టర్ కంటిన్యు అవ్వాలంటే ఇక్కడి చట్టాలకు లోబడి ఉండాల్సిందే అన్న విషయాన్ని పార్టీలకు అతీతంగా సంఘంలోని సభ్యులంతా ఏకగ్రీవంగా తేల్చిచెప్పారు.
సంఘంలోని సభ్యులు ఇంత గట్టిగా హెచ్చరించినా ట్విట్టర్ ప్రతినిధులు మాత్రం తమ వాదనకే కట్టుబడున్నారట. దాంతో సమావేశంలో పాల్గొన్న ప్రతినిధుల స్ధాయి, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవటంలో వాళ్ళకున్న అధికారాలను రాతమూలకంగా తెలియజేయాలని ఆదేశించింది. సంఘం అడిగిన చాలా ప్రశ్నలకు ట్విట్టర్ డొంకతిరుగుడు సమాధానాలే ఇచ్చిందట. ట్విట్టర్ ప్రతినిధుల వరస చూస్తుంటే కేంద్రప్రభుత్వంతో ఢీ కొనటానికే రెడీ అయినట్లు అనుమానంగా ఉంది. మరి ఇదే నిజమైతే కేంద్రాన్ని కాదని ట్విట్టర్ భారత్ లో మనగలదా ?
This post was last modified on June 19, 2021 7:48 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…