బీజేపీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతున్నట్లుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశంపై పట్టణంలో బీజేపీ నేతలు నానా గోల చేశారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎంఎల్ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ నేపధ్యంలోనే ప్రొద్దుటూరులో ఆందోళనలకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపిచ్చారు. దాంతో లోకల్ కమలం నేతలు నానా గోల చేశారు.
ప్రొద్దుటూరులో అసలు టిప్పు సుల్తాన్ విగ్రహం ఎందుకు పెట్టాలని అనుకున్నారనే విషయమై పెద్దగా సమాచారం లేదు. అయితే స్దానికంగా ఉండే ముస్లిం నేతల కోరిక కారణంగానే విగ్రహం ఏర్పాటుకు ఎంఎల్ఏ అధికారులతో మాట్లాడినట్లు ప్రచారంలో ఉంది. దీన్నే బీజేపీ నేతలు సహించలేకపోతున్నారు. టిప్పు సుల్తాన్ దేశద్రోహి, హిందు వ్యతిరేకంటు నినాదాలతో గోల గోల చేశారు.
నిజానికి చారిత్రక ఆధారాల ప్రకారం మైసూరును పరిపాలించిన టిప్పుసుల్తాన్ బ్రిటీషు వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద పోరాటాలే చేశారు. ప్రత్యేకించి హిందువులను వేధించినట్లు కానీ లేకపోతే భరతమాతకు ద్రోహం చేసినట్లు కానీ లేదు. ఈ కారణాలతోనే మైసూరు, బెంగుళూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఇప్పటి ప్రభుత్వాలు కూడా టిప్పుసుల్తాన్ జయంతులను ఘనంగా నిర్వహిస్తున్నాయి.
ఒకవైపు కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం కూడా టిప్పుసుల్తాన్ జయంతులను ఘనంగా నిర్వహిస్తుంటే ఏపిలో బీజేపీ నేతలు మాత్రం సుల్తాన్ను దేశద్రోహని, హిందు వ్యతిరేకంగా గోల చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఏదో కారణంతో గోల చేయటం ద్వారా బీజేపీ ప్రజల దృష్టిని ఆకర్షించాలని ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లుంది.
This post was last modified on June 19, 2021 3:49 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…