ఒకటికి మించి మరొకటి అన్నట్లుగా ఇటీవల కాలంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు మరింత అప్రమత్తంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న విషయాలకు అమితమైన ప్రాధాన్యత ఇవ్వటం చికాకుకు గురి చేస్తోంది. ఇది సరిపోదున్నట్లుగా ఇటీవల ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ హడావుడి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
దీని వెనుక ఉన్నదెవరు? ఉన్నట్లుండి కుప్పంలోనే ఎన్టీఆర్ జపం ఎందుకు మొదలైంది? అసలేం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ 40 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయటాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలీ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారన్న అంశంపై బాబు లోతైన అధ్యయనం చేస్తున్నారని చెబుతున్నారు. ఆపరేషన్ కుప్పం ఇప్పుడు కొత్తది కాకున్నా.. ఎన్టీఆర్ ను తెర మీదకు తీసుకురావటంతో ఆయన ఉలిక్కి పడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఇలా చేస్తున్నారా? లేదంటే రాజకీయ ప్రత్యర్థులు కొందరు స్థానిక నేతల్ని తమవైపు తిప్పుకొని.. ఇలా చేస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో తన నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బాబు చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఒక టీంను ఏర్పాటు చేసి.. ఎన్టీఆర్ హడావుడి వెనుక ఉన్నదెవరన్నది తేల్చాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఏమైనా సొంత నియోజకవర్గంలోనే తనకు ఎదురైన షాకింగ్ పరిణామం ఆయన్ను కొత్త టెన్షన్ కు గురి చేస్తోందని చెబుతున్నారు.
This post was last modified on June 18, 2021 10:20 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…