బీజేపీ నేత పెద్దిరెడ్డి మాటలు విన్నవారంతా మరీ ఓవర్ యాక్షన్ పనికిరాదంటున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇస్తే పోటీకి రెడీ అని ప్రకటించటమే విచిత్రంగా ఉంది. ఈటల రాజేందరే కాదు కేసీయార్ వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పటం ఓవర్ గానే అనిపించింది. పైగా తనను సంప్రదించకుండానే ఈటలను పార్టీలోకి చేర్చుకోవటం ఏమిటంటు మండిపడ్డారు.
చాలాకాలం తర్వాత మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలపైన పార్టీలో చర్చ జరుగుతోంది. టికెట్ మీద హామీ తీసుకోకుండానే ఈటల బీజేపీలోకి చేరేంత అమాయకుడు కాదన్న విషయం అందరికీ తెలిసిందే. రాజీనామా చేసిన తర్వాత జరగబోయే ఉపఎన్నికల్లో తనకే టికెట్ ఇచ్చే హామీని రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ నాయకత్వం నుండి కూడా ఈటల హామీ తీసుకున్నారు. ఆ తర్వాతే ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఇంతచిన్న విషయం కూడా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న పెద్దిరెడ్డికి తెలీకుండానే ఉంటుందా ? అసలు పెద్దిరెడ్డి బీజేపీలో చేరిందే ఏదో గట్టి హామీ తీసుకునే కదా. కాకపోతే మాజీమంత్రిగా, సిట్టింగ్ ఎంఎల్ఏగా ఈటల పార్టీలో చేరారు కాబట్టి కమలం అగ్రనేతలు పెద్దిరెడ్డికన్నా ఈటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం సహజమే. కాబట్టి రేపటి ఉపఎన్నికలో ఈటలను కాదని ఇంకోరికి బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశమే లేదు.
ఇక తనను సంప్రదించకుండానే ఈటలను బీజేపీలో చేర్చుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత పెద్దిరెడ్డిని ఎవరు సంప్రదిస్తారు ? ఎందుకు సంప్రదించాలి. ఎప్పుడో 1994, 99 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ గెలవలేదు. పెద్దిరెడ్డేమో అవుట్ డేటెడ్ అయితే ఈటలేమో లేటస్టని అర్ధమైపోతోంది. కాబట్టి ఈటలను పార్టీలో చేర్చుకోవటంలో పెద్దిరెడ్డి పర్మిషన్ అవసరమా ? ఏదేమైనా పెద్దిరెడ్డి మాటలు విన్న తర్వాత చాలా ఓవర్ యాక్షన్ చేసినట్లే అనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates