ఐటీ ఉద్యోగాలకు ఎసరు తప్పదు!

కరోనా విపత్తు వల్ల ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య కంటే ఈ లాక్ డౌన్స్ వల్ల మునుముందు రాబోయే తలనొప్పులే తీవ్రంగా ఉంటాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యం వైపు వెళుతూ ఉండగా ఐటీ రంగం దీనికి బాగా ఎఫెక్ట్ కానుంది. చాలా కంపెనీలు మూత పడే అవకాశాలున్నాయని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పలు ఐటీ సంస్థలు యూకే, యూఎస్ లో ఉండడం వల్ల, అవి కరోనా వైరస్ కి తీవ్రంగా నష్టపోవడం వల్ల సమస్యలు తప్పవంటున్నారు. ఇప్పటికే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన వారికి సదరు ఉద్యోగాలు లేవని కొన్ని సంస్థలు సమాచారం అందించాయి. పాత ఉద్యోగులలో కూడా చాలా మందికి పింక్ స్లిప్స్ ఇవ్వవచ్చునని అంచనాలున్నాయి.

జూన్ లో ఏటా వచ్చే ఇంక్రిమెంట్లు ఈసారి ఉండవట. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్తున్న వారు కూడా ఇక దేశీయ అవకాశాల కోసం చూసుకోవాల్సిందే. కరోనా మరణాల కంటే ఆర్ధిక మాంద్యం వల్ల ఒత్తిడికి లోనయి ఆత్మహత్యలకు పాల్పడే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చునని అగ్ర రాజ్యమే కంగారు పడుతున్న వేళ మానసికంగా సిద్ధపడాల్సిన తరుణమిది.