Political News

బీజేపీలోకి ఈట‌ల‌… టీఆర్ఎస్ నేత‌ల‌ కంటే ఎక్కువ ఫీల‌వుతోంది వీరే

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఎపిసోడ్ ముగిసిన సంగ‌తి తెలిసిందే. టీఆర్ఎస్‌తో పాటు ఎమ్మెల్యే ప‌ద‌వికి మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ వ్య‌వ‌హారంపై ప‌లువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేత‌లు స్పందించారు. అయితే, వాళ్ల కంటే ఎక్కువ‌గా వామ‌ప‌క్షాల నేత‌లు ఫీల‌వుతున్నార‌ని అంటున్నారు. వారు రియాక్ట్ అవుతున్న తీరు దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు.

త‌నది క‌మ్యూనిస్టు డీఎన్ఏ అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ఒత్తిడి మేర‌కు బీజేపీ చేరుతున్నాన‌ని మీడియా చిట్‌చాట్‌లో ఈటెల రాజేంద‌ర్ వెల్ల‌డించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో క‌మ్యూనిస్టు పార్టీలు సీఎం కేసీఆర్ మార్గ‌నిర్దేశంలోనే ప‌నిచేస్తున్నాయంటూ ఆరోపించారు. దీంతో మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ పచ్చి అవకాశవాది అని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట్‌రెడ్డి తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మతోన్మాద బీజేపీలో చేరుతూ సీబీఐ మీద నింద‌లు వేస్తారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసైన్డ్‌ భూములు ఎవరు కొన్నా త‌ప్పేన‌ని పేర్కొంటూ ఈట‌ల రాజేంద‌ర్ వెంటనే ఆ భూములు ప్రభుత్వానికి అప్పగించాల‌ని డిమాండ్ చేశారు.

ఇక మ‌రో వామ‌ప‌క్ష పార్టీ అయిన సీపీఎం సైతం ఈట‌ల ఎపిసోడ్‌పై స్పందించింది. బీజేపీలో చేరాలన్న ఈటల నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యం అని సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి తమ్మినేని వీరభద్రం మండిప‌డ్డారు. తాను చేస్తున్న అప్రతిష్టాకరమైన పనిని కప్పిపెట్టుకోవడానికి కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం అభ్యంతరకరమ‌న్నారు. వామపక్ష రాజకీయాలతో ప్రారంభమై లౌకిక ప్రజాస్వామికవాదిగా కొనసాగి ఇప్పుడు ఏకంగా మతోన్మాద ఫాసిస్టు బిజెపి పంచన చేరడం సిగ్గుపడాల్సిన విషయం అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇప్పటికైనా ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటే తెలంగాణ ప్రజల లౌకిక వారసత్వాన్ని గౌరవించినవారవుతారని హిత‌వు ప‌లికారు.

This post was last modified on June 5, 2021 7:21 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

థియేట్రికల్ రిలీజ్‌లు లైట్.. ఓటీటీ సినిమాలే హైలైట్

ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…

1 hour ago

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

7 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

7 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

7 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

9 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

9 hours ago