వైఎస్సార్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిదే అని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. పార్టీ పేరుతో కొంతకాలంగా న్యాయపరమైన వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తన పార్టీ పేరును జగన్ అక్రమంగా వాడుకుంటున్నట్లు అన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మహబూబ్ భాష కోర్టులో కేసు వేశారు. వెంటనే పార్టీపై తనదే అధికారమని తేల్చి చెప్పాలంటు భాష కోర్టులో వాదించారు.
ఇదే సందర్భంగా వైఎస్సార్సీపీకి జగన్ కు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు కూడా కేసులు వేలుపెట్టారు. నిజానికి ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా మహబూబ్ భాషకు మద్దతుగా కృష్ణంరాజు కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదుచేశారు. భాష కేసు వేసినపుడు పెద్దగా పట్టించుకోకపోయినా తిరుగుబాటు ఎంపి ఫిర్యాదు చేయటంతో వివాదం మరింతగా ముదిరింది.
నిజానికి భాషా ఫిర్యాదులో పసలేదని అందరి తెలుసు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర భాష రిజిస్టర్ చేసుకున్న పార్టీ పేరు అన్న వైఎస్సీర్సీపీ. జగన్ రిజిస్టర్ చేసిన పార్టీ పేరు వైఎస్సార్సీపీ. అంటే జగన్ రిజిస్టర్ చేసిన పార్టీకి ముందు అన్న అన్న పేరులేదు. ఈ విషయం తెలిసినా తిరుగుబాటు ఎంపి కమీషన్ కు ఫిర్యాదు చేయటం విచిత్రం. పైగా ఇదే పార్టీ గుర్తుపై రఘురామ పోటీ చేసి గెలిచారు.
సరే వివాదాలు రేకెత్తించటమే అందరికీ కావాల్సింది కాబట్టి పార్టీ పేరుపైన కూడా ఇంతకాలం వివాదం నడిచింది. రెండు వైపుల వాదనలు వినటంతో పాటు కేంద్ర ఎన్నికల కమీషన్ నుండి హైకోర్టు అభిప్రాయం తీసుకుంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాత వైఎస్సార్సీపీకి భాషాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పేసింది. దాంతో జగన్ కే వైఎస్సార్సీపీ సొంతమని తేలిపోయింది.
This post was last modified on June 5, 2021 10:08 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…