అనూహ్య ఘటన ఒకటి టాంజానియా పార్లమెంటులో చోటు చేసుకుంది. ఆ దేశ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఒక మహిళా ఎంపీ ధరించిన దస్తులు సరిగా లేవన్న అభిప్రాయానికి వచ్చిన పార్లమెంటు ఆమెను సభ నుంచి బహిష్కరించిన షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. వేసుకునే దుస్తుల్ని వేరేలా ఎందుకు చూస్తారు? లాంటి మాటలు మన దగ్గర చాలానే వినిపిస్తాయి. కానీ.. ఆ దేశంలో మాత్రం అలాంటివేమీ వినిపించలేదని చెబుతున్నారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
టాంజానియా పార్లమెంటులో మహిళా ఎంపీ కండెస్టర్ సిచ్వాలే ఒకరు. మిగిలిన మహిళా ఎంపీలతో పోల్చినప్పుడు ఆమె టైట్ జీన్సు వేసుకున్నారు. ఎల్లో కలర్ టాప్ వేసుకున్నారు. చూసేందుకు ఇబ్బందికరంగా.. ఆ మాటకు వస్తే అశ్లీలత ఉట్టిపడేలా లేదు. కాకుంటే.. ఒక కార్పొరేట్ మహిళా ఉన్నత ఉద్యోగి మాదిరి రెఢీ అయి వచ్చారు. ఆమె డ్రెస్సింగ్ మీద మిగిలిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీంతో స్పందించిన స్పీకర్ చర్యలకు రెఢీ అయ్యారు. బిగుతైన దుస్తులు ధరించి పార్లమెంటుకు సమావేశానికి హాజరైన సిచ్వాలేను పార్లమెంటు నుంచి బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచి దుస్తులు ధరించాలని హితబోధ చేయటం గమనార్హం. దీంతో.. సదరు ఎంపీ ఏమీ మాట్లాడకుండా సభ నుంచి బయటకు వచ్చేశారు. గతంలోనూ ఫిర్యాదులు వచ్చినప్పటికి.. తాజాగా వచ్చిన ఫిర్యాదుపై తప్పనిసరిగా స్పందించాల్సి వస్తుందని.. అందుకే ఆమెను సభ నుంచి బయటకు పంపేశారు. ఇకపై వచ్చే సభ్యులంతా జాగ్రత్తగా డ్రెస్ కావాలని కోరారు.
టాంజానియా పార్లమెంట్ నిబంధనల ప్రకారం మహిళా సభ్యురాలు టైట్ జీన్సు వేసుకురావటం నిబంధనలకు విరుద్ధమని మిగిలిన వారు చెబుతున్నారు. కొందరు మహిళా ఎంపీలు రూల్స్ ను పెద్దగా పట్టించుకోకుండా.. తమకు నచ్చిన దుస్తుల్లో వచ్చారు. అందుకు భిన్నంగా అనూహ్య చర్య తీసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఆమె వేసుకున్న దుస్తులకు అంత కఠిన చర్య తీసుకోవాల్సి ఉందా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
This post was last modified on June 4, 2021 9:22 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…