వ్యాక్సిన్ కొనుగోలు చేయటానికి సిద్ధం.. కేంద్రం చెప్పినట్లే కొనుగోలు చేయాల్సి వస్తుందంటూ ఏపీ సర్కారు వినిపిస్తున్న వాదన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కేంద్రం ఇచ్చే కోటాతో సంబంధం లేకుండా.. కొన్ని రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు భిన్నమైన వాదనను వినిపిస్తోంది ఏపీ సర్కారు.
రాష్ట్రంలో టీకా అవసరం ఉన్న వారందరికి ఉచితంగా వేయాలన్న సంకల్పంలో ప్రభుత్వం ఉందని.. అయితే కేంద్రం మాత్రం45 ఏళ్లకు పైబడిన వారికి మాత్రమే టీకాలు ఇస్తామంటోందని చెబుతోంది. టీకా కోసం రూ.1600 కోట్ల ఖర్చుకు సిద్ధమైనప్పటికి.. కేంద్రం కేటాయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. కేంద్రంతో సంబంధం లేకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా వ్యాక్సిన్ కంపెనీల్ని సంప్రదించి.. నేరుగా కొనుగోలు చేయటాన్ని గుర్తు చేస్తున్నారు.
కేరళ.. ఢిల్లీ తదితర రాష్ట్రాల వారు తమకు తాముగా టీకాలు కొనుగోలు చేసేలా గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్నప్పుడు.. కేంద్రం పరిమితులకు లోబడి కొనుగోలు చేయాలని చెప్పటాన్ని తప్పు పడుతున్నారు. కేంద్రం కోటాను ఫాలో అయితే.. ఏపీలో వ్యాక్సినేషన్ కు మరింత సమయం పడుతుందన్న వాస్తవాన్ని గుర్తించాలని కోరుతున్నారు. కేంద్రం ఒకవేళ తక్కువగా పంపిణీ చేస్తే.. దాని మీద పోరాడటం.. అవసరమైతే తామే టీకా కొనుగోలు చేసుకుంటామని చెబితే సరిపోతుంది కదా? అన్న మాట వినిపిస్తోంది.
ఏమైనా.. వ్యాక్సినేషన్ విషయంలో గతంలో జరిగిన పొరపాట్లను పక్కన పెట్టి.. కేంద్ర నిర్ణయాల్ని గౌరవిస్తూనే.. తమ వంతు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. లేకుంటే మరిన్ని ఇబ్బందులు తప్పవు. మేలో 16.85 లక్షల వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తే.. ఇప్పటివరకు వచ్చినవి 11.64 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే. ఇప్పటికి 5.21 లక్షల వ్యాక్సిన్లు రావాల్సి ఉంది. మేలో 16.85 లక్షల టీకాల కొనుగోలుకు కేంద్రం ఓకే చెప్పినట్లుగా చెబుతోంది. అదే సమయంలో జూన్ లో 14.86 లక్షల వ్యాక్సిన్లను కొనుగోలు చేసే అవకాశాన్ని ఇవ్వటం చూస్తే.. నెల గడుస్తున్న కొద్దీ టీకాల పంపిణీ పెరగాలే కానీ ఇలా తగ్గటం దేనికి నిదర్శనం? ఇలా కొనసాగితే.. వ్యాక్సినేషన్ ఎప్పటికి పూర్తి అయ్యేను?
This post was last modified on May 23, 2021 12:12 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…