ఏపీలో ఆ మధ్యన జారీ చేసిన ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల నోటిషికేషన్ కు సంబంధించి ఏపీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది. నోటిఫికేషన్ జారీలో నిబంధనల్ని పాటించలేదని పేర్కొంది. సుప్రీం ఆదేశాల్ని పాటించలేదన్న విషయాన్ని పేర్కొన్నారు.
పోలింగ్ కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాల్ని పాటించలదేని.. అందుకే నోటిఫికేషన్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికల్ని నిర్వహించాలని ఆదేశించింది. ఈ నిర్ణయం రాజకీయంగా పెను సంచలనంగా మారనుంది. పరిషత్ నోటిఫికేషన్ మీద విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఈ క్రమంలో నోటిఫికేషన్ ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తాజా తీర్పు జగన్ సర్కారుకు భారీ ఎదురుదెబ్బ కానుంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. తమ వాదనను సుప్రీంలో వినిపించే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. జగన్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on May 21, 2021 11:35 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…