ఈటల ఢిల్లీ ప్రయాణం దేనికో ?

మాజీమంత్రి, ఎంఎల్ఏ ఈటల రాజేందర్ ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు. శని, ఆదివారాల్లో ఢిల్లీలోని పలువురు కీలక నేతలతో భేటీ అవబోతున్నట్లు సమాచారం. కేసీయార్ తో పడని కారణంగా చాలాకాలంగా ఈటల వ్యవహారం బాగా చర్చనీయంశమవుతోంది. ఈ నేపధ్యంలో భూకబ్జాల ఆరోపణలపై ఒక్కసారిగా ఈటలను వైద్య, ఆరోగ్య శాఖమంత్రిగా పీకేశారు. తర్వాత మంత్రిగా కేసీయార్ బర్తరఫ్ చేశారు. ప్రస్తుతం మాజీమంత్రి టీఆర్ఎస్ లో ఉన్నారో లేదో కూడా కన్ఫ్యూజన్ గానే ఉంది.

పార్టీ నుండి బహిష్కరించలేదు కాబట్టి ఈటల ఇంకా టీఆర్ఎస్ లోనే ఉన్నట్లు లెక్క. అయితే పార్టీలోని మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలు ఎవరు కూడా ఈటలతో మాట్లాడటంలేదు. అందరు మూకుమ్మడిగా డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నారు. ఈ కారణంగా ఈటలను అనధికారికంగా పార్టీలో నుండి బహిష్కరించినట్లే లేక్క.

భవిష్యత్ రాజకీయాల్లో మాజీమంత్రి అడుగులు ఎలా ఉండబోతున్నాయనేది ప్రస్తుతానికైతే సస్పెన్సనే చెప్పాలి. అయితే వరసబెట్టి చాలమందితో సమావేశమయ్యారు. ఒకవైపు బీజేపీ నేతలతో సమావేశమవుతునే మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలతో కూడా భేటీలు జరుపుతున్నారు. దీంతో ఈటల రాజకీయం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు.

బీజేపీలో చేరుతారని ఒకవైపు లేదు లేదు కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం ఒకవైపు ఊపందుకుంది. ఇదే సమయంలో కొత్తపార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇన్ని ప్రచారాల మధ్యలో ఈటల ఢిల్లీకి వెళుతున్నారని సమాచారం. సోనియాగాంధి, రాహూల్ తో భేటీకి ఈటల అపాయిట్మెంట్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈటల ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకున్నారట. మరి చివరకు ఈటల వ్యూహాలు ఏ విధంగా ఉండబోయేది రెండు మూడు రోజుల్లో తేలిపోతుందనే అనుకుంటున్నారు. మొత్తానికి ఈటల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతు జనాల్లో ఆసక్తిని పెంచుతోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.