Political News

బాబు హైదరాబాద్ దాటరు.. జగన్ తాడేపల్లి వీడరు

రాజకీయ చైతన్యం అన్నంతనే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వస్తుంది చాలామందిలో. పేరుకు పిల్లాడే కావొచ్చు కానీ.. రాజకీయ చైతన్యం ఆంధ్రా ప్రాంతంలోని ప్రతి సందులోనూ కనిపిస్తుందన్న మాట అందరి నోట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో.. కరోనా కష్ట కాలంలో ప్రజలకు నేనున్నా అన్న ధీమా ఇచ్చే అధినేతే లేకుండా పోయారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. ఆ మధ్యన జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత జగన్ సర్కారు పవర్లోకి రావటం తెలిసిందే.

కరోనా కేసులు అంకతంతకూ పెరిగిపోతూ.. రోజుకు దగ్గర దగ్గర పాతిక వేల వరకు (సోమవారం కాస్త తగ్గుముఖం పట్టి.. ఇరవై వేల కంటే తక్కువగా నమోదయ్యాయి) నమోదు కావటం.. అధికారికంగా నమోదయ్యే మరణాలకు.. అనధికారికంగా నమోదవుతున్న చావులకు ఎక్కడా పొంతన ఉండని పరిస్థితి. కరోనా సోకి.. కాస్త సీరియస్ అయితే చాలు.. ఏపీకి చుట్టుపక్కల ఉన్న వివిధ రాష్ట్ర రాజధానులకు వైద్యం కోసం పరుగులు తీయాల్సిన దుస్థితి. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సుల విషయంలో తెలంగాణ సరిహద్దుల్లో ఎదురైన అనుభవం.. హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని సీరియస్ అయితే కానీ.. సెట్ కాని పరిస్థితి.
ఉన్న రాష్ట్రాన్ని వదిలి.. ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం వేరే రాష్ట్రాలకు పరుగులు తీసే దౌర్భాగ్యాన్ని ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఏపీ విషయానికి వస్తే.. సూపర్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కరోనా కష్ట కాలంలోనూ వేలాది రూపాయిల్ని సంక్షేమ పథకాల కింద బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తున్న ఆయన.. బాధితులకు అవసరమైన ఆక్సిజన్.. బెడ్ల కోసం మాత్రం కిందా మీదా పడుతున్నారు. ఇప్పుడున్న కష్ట కాలంలో ప్రజల్ని మరింతగా ఆదుకునేందుకు.. వారికి అవసరమైన వైద్య సాయాన్ని అందించేందుకు చర్యల వేగాన్ని పరుగులు తీయాల్సి ఉంది. కానీ.. అదేమీ జరుగుతున్నట్లుగా కనిపించదు.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఏపీ అధికారపక్ష నేత.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీస్ వీడేందుకు అస్సలు ఇష్టపడటం లేదన్న మాట వినిపిస్తోంది. నిత్యం అధికారులకు రివ్యూలు నిర్వహించటం.. ప్రెస్ రిలీజ్ లు విడుదల చేయటంలాంటివి చేస్తున్నారు కానీ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని స్వయంగా పరిశీలిస్తున్నదే లేదు. కరోనా కష్ట కాలంలో ఇలా ఊళ్లు పట్టుకొని తిరుగుతారా? అన్న సందేహం రావొచ్చు. జగన్ అంటే అధికారంలో ఉన్నారు. బోలెడన్ని బాధ్యతలు ఉంటాయని సరిపెట్టుకోవచ్చు.

మరి.. విపక్ష నేత చంద్రబాబు మాటేమిటి? సీనియర్ నేతగా.. సంక్షోభాలెన్నింటినో చూసిన అధినేతగా పేరున్న ఆయన.. కరోనా వేళలో ఆరోగ్య సమస్యలతో అల్లాడుతున్న తన రాష్ట్ర ప్రజల కోసం ఆయన కనీసం ఏపీలో కూడా ఉండకుండా హైదరాబాద్ లోని తన నివాసానికే పరిమితం కావటం గమనార్హం. ఆంధ్రోళ్ల సుడి కాకుంటే.. ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసు ను దాటి బయటకు రారు. విపక్ష నేత ఏమో హైదరాబాద్ లోని సొంతింటిని వదిలి అడుగు బయటపెట్టేందుకు ఇష్టపడరు. ఇలాంటి నేతలున్న ఏపీ ప్రజలకు మించిన సుడిగాళ్లు ఇంకెవరు ఉంటారు చెప్పండి?

This post was last modified on May 18, 2021 11:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

10 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

12 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

12 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

13 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

14 hours ago