చైనా నిజంగానే ఇంతపని చేస్తోందా ?

తాజాగా వెల్లడైన సమాచారంతో యావత్ ప్రపంచం విస్తుపోతోంది. కరోనా వైరస్ తో ఆయుధాలను తయారుచేసే విషయాన్ని చైనా శాస్త్రవేత్తలు ఆరేళ్ళక్రితమే చర్చించినట్లు ది ఆస్ట్రేలియన్ ప్రత్యేక కథనాన్ని అందించింది. ది ఆస్ట్రేలియన్ వెల్లడించిన తాజా కథనం ఇపుడు ప్రపంచంలో సంచలనంగా మారింది. మూడో ప్రంపంచ యుద్ధం అంటు జరిగితే అది జీవాయుధాలతోనే జరుగుతుందని డ్రాగన్ శాస్త్రవేత్తలు ఎప్పుడో నిర్ణయించారట.

సార్స్, కరోనా లాంటి వైరస్ లనే నూతనరకం జీవాయుధాలు అవుతాయనే చర్చ శాస్త్రజ్ఞుల మధ్య ఎప్పటినుండో జరుగుతోందట. మనుషుల్లోకి వ్యాధికారక వైరస్ లోకి వీటిని కృత్రిమంగా చొప్పించి ఆయుధాలుగా మలుచుకోవచ్చనే అభిప్రాయానికి శాస్త్రజ్ఞులు వచ్చినట్లు కథనంలో చెప్పింది. మూడో ప్రపంచ యుద్దమంటు జరిగితే అది జీవాయుధాలతోనే జరుగుతుందనే పద్దతిలో చైనా శాస్త్రజ్ఞులు, వైద్యాధికారులు ప్రత్యేకంగా పరిశోధన పేపర్లనే సబ్మిట్ చేశారట.

జీవాయుధాలతో దాడిచేస్తే శతృదేశాల వైద్య వ్యవస్ధలు మొత్తం కుప్పుకూలిపోతుందని డ్రాగన్ దేశం అంచనా వేసిందట. కరోనా వైరస్ ప్రపంచంలో విరుచుకుపడింది 2019లో. అంటే అంతకుముందు ఐదేళ్ళ క్రితమే సార్స్, కరోనా లాంటి వైరస్ లతో ఆయుధాలను తయారు చేసే విషయంపై శాస్త్రవేత్తలు, వైద్యాధికారుల మధ్య చర్చలు జరిగాయంటే బయట ప్రపంచానికి తెలీని విషయాలో చైనాలో ఏదో జరుగుతోందనే అనుమానాలు ప్రపంచంలో పెరిగిపోతోంది.

తాజాగా ది ఆస్ట్రేలియన్ వెల్లడించిన ప్రత్యేక కథనంతో మరోసారి డ్రాగన్ పాలకుల దుష్టపన్నాగాలపై ప్రపంచంలో చర్చ మొదలైంది. కరోనా వైరస్ పుట్టుక చైనాలోని ఊహాన్ మార్కెట్ అని చెప్పటం కూడా తప్పేనని ఆస్ట్రేలియా ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. కరోనా పుట్టుక మూలాలను పరిశోధించాలని ప్రపంచం శాస్త్రజ్ఞులు ప్రయత్నించినపుడు చైనా పాలకులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా ఎప్పటినుండో జీవాయుధాల తయారీపై డ్రాగన్ సైన్యంపై జరుగుతున్న ప్రచారం తొందరలోనే వాస్తవమయ్యేట్లుంది.