గత నెల వరకు 45 ఏళ్లు పైబడ్డ వారికే వ్యాక్సిన్ వేస్తూ వచ్చారు. కానీ ఈ నెల ఒకటో తారీఖు నుంచి 18 ఏళ్లు పైబడ్డ వాళ్లకూ వ్యాక్సిన్ అంటూ ఘనంగా ప్రకటనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కొన్ని రోజుల ముందే రిజిస్ట్రేషన్ కూడా మొదలుపెట్టింది. కానీ ఈ ప్రకటనలన్నీ పేరుకే అని తేలిపోయింది. 45 ఏళ్లు పైబడ్డ వాళ్లకే సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోగా.. 18 ప్లస్ వాళ్లకు ఎక్కడ టీకా వేస్తాం అంటున్నాయి రాష్ట్రాలు. రాష్ట్రాలు సొంతంగా డబ్బులు పెట్టుకుంటామన్నా వ్యాక్సిన్ తయారీ సంస్థలు డిమాండ్‌కు సరిపడా టీకాలు ఇచ్చే స్థితిలో లేవు. పోనీ కేంద్రం ఏమైనా చొరవ తీసుకుని వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తోందా అంటే అదీ లేదు. ఈ స్థితిలో రాష్ట్రాలూ ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి.
18 ఏళ్లు పైబడ్డ వాళ్లకు సెప్టెంబర్లో కానీ వ్యాక్సిన్లు వేయలేమంటూ మొన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిజాన్ని ఓపెన్‌గా చెప్పేశారు. తెలంగాణలో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు.
గత నెల వరకు ఇస్తూ వచ్చిన రోజు వారీ స్థాయిలో కూడా కేంద్రం వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయకపోవడంతో తెలంగాణలో 45 ప్లస్ వయసు వాళ్లకు కూడా వ్యాక్సినేషన్ ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. కేంద్రం నుంచి వ్యాక్సిన్లు రాని నేపథ్యంలో శనివారం నుంచి ఈ నెల 15 వరకు తొలి డోస్ వ్యాక్సిన్లు ఎవరికీ వేయట్లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
కేవలం ఇంతకుముందు తొలి డోస్ వేసుకుని రెండో డోస్‌కు సిద్ధమైన వాళ్లకు మాత్రమే ఈ వారం రోజులు టీకా వేయనున్నారట. మూణ్నాలు రోజుల తర్వాత రోజుకు రెండున్నర లక్షల డోసుల చొప్పున తెలంగాణకు కేంద్రం నుంచి వ్యాక్సిన్లు వచ్చే అవకాశముందని.. అప్పుడు పరిస్థితి బట్టి మళ్లీ వ్యాక్సినేషన్ జరుగుతుందని తెలంగాణ అధికార వర్గాలు అంటున్నాయి. మే నెల అంతా టీకాల కొరత కొనసాగవచ్చని.. జూన్‌లో కానీ వ్యాక్సినేషన్ పుంజుకునే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.
This post was last modified on May 8, 2021 8:49 am
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు త్వరలోనే ఏపీ మంత్రిగా…
ఎమ్మార్ ప్రాపర్టీస్ తెలుగు నేల రాజకీయాలను భారీ కుదుపునకు గురి చేసిన వ్యవహారం. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నాటి…
దళిత యువకుడి కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు పోలీసు కస్టడీ ముగిసింది.…
ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా… వీర విహారం చేసిన ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతున్న సంగతి…
గత మూడు నాలుగు నెలలుగా ఇండస్ట్రీని తీవ్రంగా పట్టి పీడిస్తున్న హెచ్డి పైరసీ రోజురోజుకు పేట్రేగిపోతోంది తప్ప తగ్గే సూచనలు…
"మాట తప్పడు-మడమ తిప్పడు" అని వైసీపీ నాయకులు చెప్పుకొనే జగన్.. వ్యవహారం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అన్ని వైపుల నుంచి…