Political News

నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఇంత వివక్షా ?

దేశం యావత్తు కరోనా వైరస్ కష్టకాలంలో ఉండగా సాయం అందించటంలో నరేంద్రమోడి సర్కార్ పక్షపాతబుద్ధి బయటపడిందా ? అవుననే సమాధానం చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు కూడా ఇందుకు కారణాలుగా ఉన్నాయి మరి. ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పటికే టీకాలను అందించటంలోను, ఆక్సిజన్ సరఫరా చేయటంలోనే కేంద్రం అనుసరిస్తున్న వివక్ష బయటపడింది. ఎక్కువ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు టీకాలను అందిచని విషయం బయటపడింది.

రోజుకు వేలాది కేసులు నమోదవుతున్న మహారాష్ట్రకు తక్కువ టీకాలను సరఫరా చేసిన కేంద్రం అంతకన్నా తక్కువ కేసులు నమోదవుతున్న గుజరాత్ కు ఎక్కువ టీకాలు సరఫరా చేసిన విషయం బయటపడింది. ఇలాగే ఆక్సిజన్ సరఫరా విషయంలో కూడా కేంద్రం వివక్ష చూపుతున్న విషయం స్పష్టమైపోయింది. కష్టకాలంలో బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఎక్కువ దృష్టిపెట్టిన నరేంద్రమోడి సర్కార్ నాన్ బీజేపీ రాష్ట్రాలపై మాత్రం తక్కువ చూస్తోందని ఇప్పటికే చాలా ఆరోపణలున్నాయి.

సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే తాజాగా విదేశాల నుండి పెద్దఎత్తున మెడికల్ ఎక్విప్మెంట్ వచ్చింది. ఈ ఎక్విప్మెంట్ పంపిణిలో కూడా వివక్ష చూపుతోందనే గోల పెరిగిపోతోంది. ఇందుకు కారణం ఏమిటంటే ఆస్ట్రేలియా నుండి 1056 వెంటిలేటర్లు, బిపాప్-సిపాప్ యంత్రాలు, 43 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయి. అమెరికా నుండి 43 వేల ర్యాపిడ్ డయాగ్నస్టిక్ కిట్లు, 1.56 లక్షల రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు, పీపీఈ కిట్లు, బహ్రెయిన్ నుండి 2 ధ్రవీకృత ఆక్సిజన్ కంపెయినర్లు వచ్చాయి.

విదేశాల నుండి వచ్చిన మెడికల్ ఎక్విప్మెంట్ ను రాష్ట్రాలకు పంపినట్లు కేంద్రం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయితే ఏ ఏ రాష్ట్రాలకు ఎంతెంత సాయాన్ని పంపిణీ చేశారో చెప్పమంటే మాత్రం చెప్పటంలేదు. ఇదే విషయాన్ని మీడియా ఎన్నిసార్లు అడుగుతున్నా కేంద్రం సమాధానం చెప్పటంలేదు. దీంతో బీజేపీ పాలితరాష్ట్రాలకే కేంద్రం ఎక్కువ సాయం అందించిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. సాయం అందించటంలో పాదర్శకత పాటించని కారణంగానే కేంద్రం సమాధానాలు చెప్పటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

This post was last modified on May 7, 2021 1:38 pm

Share

Recent Posts

సోమిరెడ్డి ఇలాకాలో నువ్వా – నేనా

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీల మధ్య తీవ్ర రాజకీయ పోటీ నడుస్తోంది. ప్రస్తుత…

1 hour ago

70 వయసులో అదిరిపోతున్న ‘చిరు’ ప్లానింగ్

ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…

4 hours ago

ఇరుముడి వేట అయిపోలేదు స్వామి

ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…

8 hours ago

బాలయ్య మనసు మారితే బాక్సాఫీస్ యుద్ధమే

డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…

8 hours ago

రణబాలి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త

సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…

11 hours ago

RTO ఆఫీసుకు వెళ్లకుండానే LLR… టెస్ట్‌లో AI నిఘా!

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…

13 hours ago